దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటటం, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతున్న కరెన్సీ విలువ, తీవ్ర ద్రవ్యోల్బణం లాంటివన్నీ.. పాక్‌ను పట్టిపీడిస్తున్నాయి. వీటి నుంచి బయటపడలేక పాక్ విలవిలలాడుతోంది. ఇప్పటికే.. సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెట్టింది. ఇదిలావుంటే.. పాక్ లో చోటుచేసుకున్న ఒక హృదయ విదారకర సంఘటన యావత్ ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పాకిస్థానీలు గోధుమ పిండి కోసం విచక్షణ రహితంగా కొట్టుకున్నారు.
పాకిస్థాన్‌లో గోధుమ నిల్వలు అడుగంటి పోయాయి. దీంతో కిలో గోధుమ పిండి ధర రూ.150కి పైకి చేరింది. అయినప్పటికీ జనాలు, గోధుమ పిండి కోసం ఎగబడుతున్నారు. దీని కారణంగా ఖైబర్ ఫక్తున్కా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి గోధుమ పిండి కోసం జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. గోధుమ పిండి బ్యాగుల్ని సరఫరా చేస్తున్న ప్రదేశాల్లో జనం ఆ లారీలపైనే దాడి చేస్తున్నారు. పిండి సంచుల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జనం ఒకర్ని ఒకరు తోచుకుంటూ బ్యాగుల్ని ఎత్తుకెళ్లుతున్నారు. సర్కార్ కూడా ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నది. కరాచీలో కిలో పిండి రూ.160కి అమ్ముతున్నారు. షార్టేజ్ కారణంగా మిల్లుల ఓనర్లు గోధమ బ్యాగ్ ధరలను విపరీతంగా పెంచుతున్నారు.
Pakistan में ये लड़ाई…ये झगड़ा…ये दंगे जैसे हालात आटे की बोरी के लिए हो रहे हैं…#PakistanEconomy #Pakistan pic.twitter.com/EzoI2LoSc9
— Jyot Jeet (@activistjyot) January 9, 2023
మరోవైపు.. పాక్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. ప్రస్తుత్తం 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక వెల్లడిస్తోంది. ఈ పరిస్థితిపై పాక్ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ స్పందించారు. తమ దేశం దివాళా తీయదని, ఈ పరిస్థితికి మునుపటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని నిందించారు. పాక్ ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా ఒక కారణమే. ఈ వరదల కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. పాక్ పరిస్థితిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“आटा नहीं दे सकते तो हमारे ऊपर गाड़ी चढ़ा दो हमें ख़त्म करदो…” आटा नहीं मिलने पर Pakistan के लोग सड़कों पर लेटकर मरने की धमकी दे रहे है…#PakistanEconomy #Pakistan pic.twitter.com/zzWTJAHLCG
— Jyot Jeet (@activistjyot) January 9, 2023