జంతువులు, పక్షులు చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కొన్ని పక్షులు, జంతువులు దొంగతనాలు కూడా చేస్తుంటాయి. అలా పలు జంతువులు ఇంట్లోని డబ్బుల మూటను, నగలను, తాళను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాయి. దీంతో ఆ ఇంటి యజమానులు తెగ కంగారు పడి వాటి కోసం వెతుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పక్షులు వచ్చి.. వారి వద్ద ఉన్న వస్తువులను ఎగరేసుకుని వెళ్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాము. తాజాగా అలాంటి ఘటన ఒకటి చిలీలో జరిగింది. విధుల్లో ఉండి లైవ్ రిపోర్టు ఇస్తున్న వ్యక్తి చెవిలోని ఇయర్ ఫోన్ ను ఓ రామ చిలుక చోరీ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొంతకాలం నుంచి చిలీలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. వీటి గురించి ప్రతిపక్షాలు, మీడియా వాళ్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో చిలీలో పెరుగుతున్న దొంగతనాల గురించి ఓ రిపోర్టర్ లైవ్ లో మాట్లాడాడు. అప్పుడే ఒక చిలుక వచ్చి ఆయన పై వాలింది. అయితే అది తనను ఏమి అనలేదు కదా? , చూటానికి కూడా బాగుందని సైలెంట్ గా ఉన్నాడు. అలా దొంగతనాల గురించి రిపోర్టర్ వివరిస్తున్నాడు. ఆ చిలుక అతడి భుజంపై వాలి.. అటు ఇటు దిక్కులు చూస్తుంది. అలానే అతడి చెవు వైపు వెళ్లి,.. తన ముక్కుతో తాకుతుంది. అతడు తన డ్యూటిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో సడెన్ గా ఆ చిలుక.. అతడు పెట్టుకున్న ఇయర్ ఫోన్ ను ముక్కుతో పట్టుకుని వెళ్లిపోయింది. దీంతో అతడు ఒక్కసారిగా కంగారు పడ్డాడు.
దాని వెంట పరుగులు తీశాడు. అది చాలా దూరం ఎగిరిపోయింది. కొద్ది సమయం తర్వాత తిరిగి ఆ రిపోర్టర్ ఉన్న ప్రాంతం వద్దకు వచ్చి.. ఇయర్ ఫోన్ వదిలేసింది. మళ్లీ.. ఎక్కడ ఆ చిలుక వచ్చి..తీసుకెళ్తుందోనని రిపోర్ట్ వెంటనే వెళ్లి తీసుకున్నాడు. చిలీలో మనుషులే కాదు చిలుకలు దొంగతనాలు చేస్తున్నాయంటూ సదరు విలేకరి కామెంట్స్ చేశాడు. “చిలుక నా ఇయర్ ఫోన్ ను చోరీ చేసింది. నా ఇయర్ ఫోన్ తీసుకుని ఎగిరిపోయిందని” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Beware the earphone pinching parrots 🦜 of #Huddersfield, @AndrewVossy… 😂@RLWC2021 #RLWC2021 pic.twitter.com/BXtLoHujYo
— Jayne Halhead 🇺🇦 (@Jaynes__World) November 5, 2022