పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు మనసు అనేదే లేదని మండిపడుతున్నారు.
ఒక దేశ ప్రధాని అన్నాక ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంట్రీని ముందుకు నడిపించడంలో కీలకమయ్యే ప్రతి నిర్ణయం పీఎం చేతుల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అంటే ఆ దేశపు ముఖచిత్రంగా చెబుతుంటారు. అలాంటి ప్రధాని పొజిషన్లో ఉన్నవారు ఎంతో గౌరవప్రదంగా నడుచుకోవాలి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తన ఎంతో హుందాగా ఉండాలి లేకపోతే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రెండ్రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న షరీఫ్.. గురువారం పారిస్‌లో జరిగిన ఒక సదస్సుకు అటెండ్ అయ్యారు. అయితే.. ప్రొటోకాల్ ఆఫీసర్‌తో ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ పారిస్ మీటింగ్‌కు వెళ్లినప్పుడు వర్షం కురిసింది. దీంతో ఆ టైమ్‌లో ప్రొటోకాల్ అధికారిణి ఒక గొడుగుతో ఆయన కారు ముందు నిలుచున్నారు. షరీఫ్ కారు దిగిన వెంటనే తడవకుండా ఆమె గొడుగు పట్టుకున్నారు. అయితే ప్రధాని మాత్రం ఆమెతో ఏదో మాట్లాడి చేతిలో ఉన్న గొడుగును తీసుకొని లోపలికి వెళ్లిపోయారు. గొడుగు లేకపోవడంతో ఆ అధికారిణి వర్షంలో తడిసి ముద్దయ్యారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక వెబ్సైట్లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా అధికారిని ప్రధాని వర్షంలో వదిలి వెళ్లడాన్ని కొందరు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. షరీఫ్‌కు మనసే లేదని, కనీసం మహిళ అనే కనికరం లేకుండా అలా వర్షంలో వదిలి వెళ్లడం ఏంటని విమర్శిస్తున్నారు. కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఉద్దీపన ప్యాకేజీని అందించాలనే ప్రయత్నంలో భాగంగా షెహబాజ్ షరీఫ్.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండీ క్రిస్టలినా జార్జివాతో గురువారం సమావేశమయ్యారు.
#WATCH | Pakistan’s Prime Minister #ShehbazSharif takes an umbrella from a protocol officer but proceeds alone, leaving her drenched pic.twitter.com/P55KJalwns
— WION (@WIONews) June 22, 2023