ఈ కాలంలో మగాళ్ల పెళ్లి వారి కుటుంబాల చావుకు వస్తోంది. ఓ వైపు అమ్మాయిలు దొరక్క.. మరో వైపు దొరికినా వారి ఆశలకు మగవారి స్థోమత సరిపోక చాలా మంది 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్ల పరిస్థితి. ఒకరకంగా ఇండియా మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ, కొన్ని బయటి దేశాల్లో బహుభార్యాత్వం నేరం కాదు కాబట్టి.. రెండు, మూడు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఒకే సారి ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఒకేలా ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన కెన్యాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కెన్యాకు చెందిన కేట్, ఈవ్, మేరీ ఐడెంటికల్ ట్రిప్లెట్స్. వీరు చూడ్డానికి ఒకేలా ఉంటారు. వీరు ముగ్గురు గాస్పెల్ మ్యూజిక్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేట్‌కు స్టీవోతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజులకే ప్రేమగా మారింది. ఓ రోజు అతడు ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి కలిశాడు. అప్పుడు అతడికి అర్థం అయింది. తాను కేట్ ఒక్కదాని కోసమే పుట్టలేదని, ముగ్గురి కోసం పుట్టానని. తర్వాత ముగ్గుర్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోవటం, వారితో కాపురం చేయటంపై అతడు మాట్లాడుతూ..
‘‘ ముగ్గురు అక్కా చెల్లెళ్లను సంతృప్తి పర్చటం చాలా కష్టం అని అందరూ అంటున్నారు. అదేం పెద్ద సంగతి కాదు. నేను ఇందుకోసం ఓ టైమ్ టేబుల్ ఫాలో అవుతున్నాను. అందరికీ సమానమైన టైం ఇస్తున్నాను. సోమవారం మేరీ కోసం, మంగళవారం కేట్, బుధవారం ఈవ్ కోసం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక, ముగ్గురు ఐడెంటికల్ ట్రిప్లెట్స్ మాట్లాడుతూ.. ‘‘ అతడికి మేము ముగ్గురం చాలు. వేరే మహిళను అతడు పెళ్లి చేసుకోవటానికి మేము ఒప్పుకోము’’ అని అంటున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Man marries set of identical triplets because the girls can’t stay away from each other🤯🤯🤯 pic.twitter.com/xNw1JTLbjf
— 🇨🇲🇳🇬TheGdMother™️🇨🇲🇳🇬 (@NjangiGuru) May 24, 2022