ఈ మధ్యకాలంలో వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్ నెట్ వాడకం పెరిగిన తర్వాత ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డారు జనం. పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మారణాయుధాల నేపథ్యంలో సాగే గేమ్‌లు. వీటిని ఆడే వారు గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. వాడిని చంపు, వీడిని చంపు అంటూ ఉంటారు. ఇలా గట్టిగా అరుస్తూ ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ యువకుడు ఓ వీడియో గేమ్ ఆడుతూ పొరపాటున పోలీసులకు ఫోన్ చేశాడు. తర్వాత తాను ఇద్దర్ని చంపేసినట్లు గట్టిగా అరిచాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వార్త మొత్తం చదివేయండి.
కెనడాకు చెందిన ఏయిజా అనే యువకుడు రేయిన్ బో సిక్స్ సేజ్ అనే వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆ గేమ్ ఆడటంలో పూర్తిగా మునిగిపోయాడు. గేమ్ మైకంలోనే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 911కు పొరపాటున ఫోన్ చేశాడు. పోలీస్‌లు అతడి కాల్ లిఫ్ట్ చేశారు. ఆ యువకుడు గేమ్ ఆడుతూనే.. ‘‘ నేను ఇద్దర్ని చంపేశాను’’ అని అరిచాడు. అతడి మాటలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే అతడి అడ్రస్ ట్రేస్ చేశారు. పోలీస్ బలగాలతో ఏయిజా ఇంటి వద్దకు వెళ్లారు. గట్టిగా అరుస్తూ అతడ్ని బయటకు పిలిచారు. పోలీసులు రావటంతో అతడికి భయం పట్టుకుంది.
భయపడుతూ ఇంటి బయటకు వచ్చాడు. అతడు బయటకు రాగానే పోలీసులు అతడికి గన్ను గురిపెట్టారు. తమ దగ్గరుకు రావాలని పిలిచారు. అతడు వారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అయినా వాళ్లు నమ్మలేదు. అతడి ఇంట్లోకి వెళ్లి మరీ సోదాలు చేశారు. ఎలాంటి హత్యలు జరగలేదని తెలిసి వెనక్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, గేమ్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డ ఏయిజా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This guy accidentally called the cops while he was playing Rainbow 6 Siege
They heard him say “I killed 2 people” over the phone and thought it was a double homicide pic.twitter.com/OPUVvu9bWz
— GUARD Hunter (@HUN2R) January 6, 2023