ఈ మద్య కాలంలో పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని బిల్డింగ్ ఊగిపోయాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రాలు హువాలియన్ కౌంటీలో, టైటుంగ్ నగరానికి సమీపంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇది చదవండి: సికింద్రాబాద్ లో ఘోరం.. భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం!
భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. తైపీ నగరానికి దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు,హుయాలిన్ నగరానికి దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో మరో భఊకంపం సంభవించింది. కాగా, 2016లో దక్షిణ తైవాన్ లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు.