బతుకుదెరువు కోసం పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, సొంతవారిని వదులుకుని విదేశానికి ప్రయాణమైన ఓ శరణార్థుల బృందాన్ని మృత్యువు కబళించింది. పడవ మునిగిన ఈ ఘటనలో 34 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..!
కొత్త జీవనాన్ని వెతుకుతూ బయల్దేరారు. సొంత దేశంలో బతకలేక పరాయి దేశానికి వలస వెళ్దామని పయనమయ్యారు. పేదరికం నుంచి బయటపడి.. మెరుగైన భవిష్యత్తు నిర్మించుకుందామని భావించారు. అన్నీ వదులుకుని, కొంగొత్త ఆశలతో ప్రయాణం ఆరంభించారు. కానీ దురదృష్టం వారిని వెంటాడింది. మృత్యువు వారిని కబళించింది. బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలస వెళ్తున్న శరణార్థుల బృందం ప్రమాదవశాత్తుగా జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయువ్య మడగాస్కర్ తీరానికి సమీపంలోని హిందూ సముద్రజలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుజూసిన ఈ ఘటనపై మడగాస్కర్ అధికారులు స్పందించారు.
మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్‌లోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఓ పడవలో కలసి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపానికి దగ్గర్లో హిందూ సముద్రజలాల్లో ఆ పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీశామని ఆఫీసర్స్ తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు రక్షించారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కొంత మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని ఆఫీసర్స్ తెలిపారు.
The boat carrying 58 passengers sailed clandestinely without going through official immigration or customs controls and sank late Saturday night off the northwest coast of #Madagascar, according to Malagasy maritime authorities.https://t.co/fBlJnWHyjm
— Mint (@livemint) March 15, 2023