పిల్లల విషయంలో ఇప్పటికీ చాలాచోట్ల ఒకింత వివక్ష కనిపిస్తూనే ఉంది. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి బయటపడేస్తాడే అనే భావనలో ఇంకా కొంత మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. అయితే ఆడపిల్లలు కూడా కొడుకుల కంటే ఏ మాత్రం తీసిపోరని చాలా సందర్భాల్లో రుజువైంది. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు పైచేయి సాధిస్తున్నారు. చివరి దశళో తల్లిదండ్రుల ఆలనా పాలనా చూస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారని నివేదికలు కూడా చెబుతున్నాయి.
ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయి గురించి మీరు తెలుసుకున్నాక.. కంటే కూతుర్నే కనాలి అంటారు. ఆ అమ్మాయి చేసింది అలాంటి ఇలాంటి త్యాగం కాదు. తండ్రి కోసం ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని తాత అని పిలిపించేందుకు ఆమె అంత గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏ కుమార్తె చేయని సాహసం చేసింది. మనవడిని తండ్రికి చేతికి ఇచ్చి ఆయన ముఖంలో ఆనందం చూస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ కుమార్తె చేసిన త్యాగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పుకోబోయే యువతి పేరు కియారా. ఆమె తల్లిదండ్రులు, సోదరితో ఆనందంగా గడుపుతోంది. అయితే వారి జీవితాన్ని క్యాన్సర్ రక్కసి కాటేసింది. తండ్రి బిర్యాన్ కు పుట్టుమచ్చ ఒకటి ఉంటే దానిని తొలగించారు. ఆ తర్వాత అతని చంకలో ఒక గోల్ఫ్ బాల్ సైజ్ లో గడ్డ వచ్చింది. దానిని పరీక్షించి క్యాన్సర్ గా గుర్తించారు. ఆ గడ్డ తొలగించిన తర్వాత కూడా మరింత వ్యాపించడం ప్రారంభించింది. బ్రియాన్ చర్మ క్యాన్సర్ స్టేజ్ లో ఉన్నారు. ఆయన త్వరలోనే చనిపోతారని వైద్యులు చెప్పారు.
అయితే చనిపోయేలోపు తాత అనిపించుకోవాలని బ్రియాన్ కోరిక. కియారా పెళ్లిచేసుకుని బిడ్డకు జన్మనిచ్చే దాకా బ్రియాన్ బతికుంటాడనే నమ్మకం లేదు. ఇంక కాయారా కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాను ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే 10 వేల పౌండ్ల వ్యవయంతో ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమెకు తొలి ప్రయత్నంలోనే వైద్యం సక్సెస్ అయ్యింది. కియారా గర్భం గాల్చింది. ఆమెకు నెలలు నిండుతున్న సమయంలో తండ్రి బ్రిమాన్ పరిస్థితి విషమించింది.
తాను బిడ్డకు జన్మనిచ్చిన వరకు అయినా తండ్రి బతికే ఉండాలని వేడుకుంది. ఆమె కోరిక ఫలిచింది. 2021 మేలో కియారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుని తీసుకుని తండ్రికి పరిచయం చేసిన క్షణం కియారా కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆ క్షణం తనకి ఇప్పటికీ గుర్తుందని చెప్పింది. తనని తాను తాత అని పిలుచుకుంటూ మనవడిని చూసుకుని బ్రియాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. తన చివరి కోరిక తీర్చుకుని బ్రియాన్ 60 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. కియారా చేసిన త్యాగం గురించి తెలుసుకుని ప్రపంచం మొత్తం ఆమెను ప్రశంసిస్తోంది. తండ్రి కోసం ఆమె చేసిన త్యాగం ఎంతో గొప్పదని వ్యాఖ్యానిస్తున్నారు.