చట్ట సభల్లో వాతావరణం ఎలా ఉండాలి? ప్రజాప్రతినిధులు అంటే ఎంత హుందాగా వ్యవహరించాలి? విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార- ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు మామూలే. అది కూడా ఎంతో హుందాగా ఉండాలి. కానీ, ఆ దేశ పార్లమెంట్ లో మాత్రం ఎంపీలు మాటలు దాటి.. చేతల్లోకి దిగారు. జోర్డాన్ పార్లమెంటు వేదికగా ఎంపీలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. అక్కడి మీడియా ఆ దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fist fight in Jordan’s parliament caught on live streamhttps://t.co/al5npJFpqK pic.twitter.com/TXHFvSNMYm
— BBC News (World) (@BBCWorld) December 29, 2021
సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో అసలు వివాదం తలెత్తింది. మంగళవారం పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష ఎంపీ ఒకరు మాట్లాడుతూ ఈ బిల్లు పనికిరానిదంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎంపీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ప్రతిపక్ష ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు ఆ ఎంపీ నిరాకరించడంతో వాగ్వాదం మొదలైంది. ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఒకరినొకలు తోసుకున్నారు. కొందరు ఎంపీలైతే చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘర్షణతో సభ వాయిదా పడింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. జోర్డాన్ పార్లమెంట్ లో ఎంపీల ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#MiddleEast It is #Jordan time. Scuffles among #parliamentarians during the discussion on the amendment of the #Constitution . What a show! pic.twitter.com/ixJLRBVAoM
— Donato Yaakov Secchi (@doyaksec) December 28, 2021