ఈ మద్య కొంత మంది ఇది తప్పు అని తెలిసి కూడా అదే పని చేస్తూ ప్రాణాల పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ జమానా నడుస్తుంది.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాటితో ఎక్కడ పడితే అక్కడ సెల్పీలు తీసుకుంటో కొన్నిసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని అంటారు.
కొంత మంది ఆకతాయిలు వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకునన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ జూలో ఉండే సంరక్షకులు బోనులో ఉన్న సింహాంతో పరాచకాలు ఆడుతూ చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జమైకాలోని జూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జమైకాలోని ఒక జూలో కీపర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి బోను లో ఉన్న సింహాన్ని ఆటపట్టించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు ఈ తతంగాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించాడు. ఈ క్రమంలోనే ఆ సింహం జూ కీపర్ చేయి పట్టుకుంది.. ఎంతగా వెనక్కి లాగాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జూ కీపర్ చేసిన వెర్రిపనికి వేలిని పోగొట్టుకున్నాడు. అక్కడే ఉన్న కొంత మంది సందర్శకులు దీన్ని కెమెరాలో బంధించారు. ఇలాంటి దుస్సాహసాలు ఎవరూ చేయొద్దని మెసేజ్ పెట్టారు.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Mo-Mo💙 (@Morris_Monye) May 22, 2022