పాలు పోసి పెంచినా సరే.. పాము కాటు వేస్తుంది. తన సహాజ గుణాన్ని అది మర్చిపోదు. అలానే శిక్షణ ఇచ్చినంత మాత్రాన.. క్రూర జంతువు.. తన బుద్ధిని మార్చుకోలేదు. ఏదో ఓ సందర్భంలో.. అది తన సహజ వైఖరి ప్రకారం ప్రవర్తిస్తుంది. తనకు శిక్షణ ఇచ్చిన వారిపై కూడా అది దాడి చేస్తుంది. ఇదుగో ఇలాంటి భయానక సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన సర్కస్ ట్రైనర్‌పై పులి దాడి చేసింది. ట్రైనర్ తలను నోట కరుచుకుంది. ఈ సంఘటనతో అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ సంఘటన వివరాలు..
ఈ భయానక ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఇక్కడి లెక్సే ప్రావిన్స్‌లోని మెరినీ ఓర్ఫీ సర్కస్‌లో ఈ ఈ ఘటన వెలుగు చూసింది. ఇవాన్ ఓర్ఫీ అనే సర్కస్ ట్రైనర్.. ఇటీవల రెండు పులలతో ప్రదర్శన ఇస్తున్నాడు. తాను ట్రైనింగ్ ఇచ్చిన జంతువులే కాబట్టి.. ఎలాంటి భయం లేకుండా.. ప్రదర్శన కొనసాగించాడు. అప్పటి వరకు.. జనాలు.. ఎంతో ఉల్లాసంగా.. అతడి ప్రదర్శనను గమనిస్తూ ఉన్నారు.. ఇంతలోనే ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. రెండు పులలతో ప్రదర్శన మొదలు పెట్టాడు సర్కస్ ట్రైనర్. ఈ క్రమంలో ఓ పులితో ప్రదర్శన ఇస్తుండగా.. సడెన్‌గా ఉన్నట్టుండి రెండో పులి.. అతడిపై దాడి చేసింది.
ట్రైనర్‌ను కిందకు లాగేసి.. అతడి మెడ, కాళ్లను నోటకరుచుకుంది. అతడు నొప్పితో అరుస్తూ.. పులి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న సహాయకుడు.. అతడిని పులి బారి నుంచి కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ పులిని కంట్రోల్ చేశాడు. ఈ సంఘటనలో ఓర్ఫి మెడ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు.. ఈ ఘటనలో ఓర్ఫి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అతడికి ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. పులిని ఐసోలేషన్‌లో ఉంచి దానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Incidente al Circo per #ivanorfei, attaccato alle spalle da una Tigre davanti ai bimbi del pubblico
Ricoverato in codice rosso#circo #Orfei pic.twitter.com/VgYDvuxkJT— SALLY (@LaSamy65280885) December 31, 2022