చేతులు కట్టుకుని నిలుచున్న వ్యక్తి పేరు – సాల్వటోర్ గారౌ . శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. శిల్పమేదీ అనుకుంటున్నారా అతను శూన్యాన్నే అమ్మాడు. నిజమే ఇక్కడ శిల్పం లేదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! అయితే దానికి ధర అతని మాటలవల్ల వచ్చింది. ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో దానిని రూపొందించాడు. అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇటలీకి చెందిన 67 ఏళ్ల సాల్వటోర్ గారౌ కంటికి కనిపించని కళాఖండం తయారు చేశాడు. ఆ కళాఖండం వేలానికి వేయగా అది 15వేల యూరోలకు (ఇండియన్ కరెన్సీలో రూ.13 లక్షలు) అమ్ముడుపోయింది.
సాల్వటోర్ కనిపించని కళాఖండంతో మాటల వల్ల జాక్‌పాట్ కొట్టేశాడు. ”ఐయామ్” అనే పేరిట కనిపించని ఒక కళాఖండాన్ని తయారు చేశాడు. కానీ అతను దానిని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. కాగా సాల్వటోర్ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండడం మీరు గమనించారా. ఇది అంతే నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి.” అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయిన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15వేల యూరోలకు కొన్నారు. కానీ దీనిని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సదరు నిర్వాహకులు సాల్వటోర్‌కు తెలిపారు.