పాకిస్థాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ద్రవ్యోల్భణం 40కి చేరింది. దేశం మొత్తం ఆకలి కేకలు మారుమ్రోగుతున్నాయి. ఆ దేశం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రష్యా నుంచి గోధుమల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టుకు చేరాయి.
పాకిస్థాన్ లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఇప్పుడు ద్రవ్యోల్భణం 40కి చేరింది. పాకిస్థాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కరువులో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు భారత నౌక కొంత ఉపశమనాన్ని కలిగించింది. రష్యా నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను భారతీయుడికి చెందిన లీలా చెన్నై అనే నౌక ద్వారా గ్వాదర్ పోర్టుకు చేర్చించింది. కరును అరికట్టేందుకు పాకిస్థాన్ 4.5 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకునేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ ఒప్పందంలో భాగంగా రష్యాలోని నోవొరోసిస్క్ పోర్టు నుంచి పాక్ లోని గ్వాదర్ నౌకాశ్రయానికి.. గ్లోబల్ మార్కెటింగ్ సిస్టమ్ సంస్థకు చెందిన ఎంవీ లీలా చెన్నై అనే భారీ నౌక గోధుమలను చేరవేసింది. ఈ జీఎంఎస్ సంస్థను అనిల్ శర్మ అనే గుజరాతీ వ్యాపరవేత్త నిర్వహిస్తున్నారు. ఆయన ఈ సంస్థ కంటే ముందు అమెరికాలోని బిజినెస్ స్కూల్ లో ప్రొఫెసర్ గా పని చేశారు. ఈయన జీఎంఎస్ సంస్థను దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో అనిల్ శర్మకు డాక్టరేట్ కూడా ఉంది. 1992లో ఈ జీఎంఎస్ సంస్థను ప్రారంభించారు. గ్లోబల్ రీసైక్లింగ్ లో అగ్రస్థానానికి చేరారు. వీరి కంపెనీకి 40 నౌకలు ఉన్నాయి.
1990ల్లో అమెరికా నేవీకి చెందిన నౌకలను విక్రయించేవారు. దీనిలో పాల్గొనేందుకు విదేశీయులకు అవకాశం ఉండదు. అలాంటి అవకాశాన్ని అనిల్ శర్మ అందిపుచ్చుకున్నారు. మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నౌకలు కొనుగోలు చేసి.. భారత వ్యాపారులకు విక్రియించే వారు. అలాగే రష్యా దగ్గర ఉన్న ఎక్స్ ట్రా నౌకలను విక్రయించేందుకు కూడా అనిల్ శర్మనే సహాయం చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 4,000 నౌకల రీసైక్లింగ్ లో అనిల్ శర్మ కీలక పాత్ర పోషించారు. 2022 షిప్ టెక్ సీఈవో ఆఫ్ ది ఇయర్ గా అనిల్ శర్మకు అవార్డు కూడా దక్కింది. దేశీయ పుట్ బాల్ లో ఒడిశా ఎఫ్ సీకి అనిల్ శర్మనే యజమాని.