మనం చిన్నప్పటినుంచి నెమలి ఈకల్ని తప్పా మరే పక్షి ఈకలను అంత శ్రద్ధగా దాచుకోము. అయితే ఇప్పుడీ సంగతి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేము. నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం., అరుదు., అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి తీసిన 800 గ్రాముల ఈకల ధర మార్కెట్‌లో $5000 పలుకుతోంది.
ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్ ఈ బాతు ఈకల్లోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా తేలికైనవిగా ఉండటంతోపాటు శరీరానికి ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. దీంతో ఖరీదైన దుస్తులు, బ్యాగులు, ఇతర వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బాతు ఈకలను సేకరించడం మొదలుపెట్టాయి. అలా వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్కో బాతు నుంచి అతి స్వల్ప మొత్తంలోనే ఈకలు లభిస్తాయి. అందుకే, ఎంత వీలైతే అంత ఎక్కువ ఈకలు సేకరించడం కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికైనా ముందుకొస్తున్నాయి.
ఒక కిలో ఈకలను సేకరించాలంటే దాదాపు 60 బాతులు అవసరం. అయితే ఒకవేళ బాతులు వారికంట పడినా వాటికి హాని తలపెట్టరు. ఈకలు సేకరించిన తర్వాత బాతును వదిలేస్తారు. కొన్నాళ్లకు బాతుకు మళ్లీ ఈకలు వస్తాయి. ఇలా ఏడాదిలో మూడుసార్లు ఈకల సేకరణ వారికి ఓ ఉపాధిలో మారుతోంది.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.