మీరు ఇంత వరకు మనుషులు కుక్కల్ని కాల్చి చంపిన ఘటనల గురించి విని ఉంటారు.. వార్తల్లో చదివి ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఇందుకు చాలా భిన్నమైనది. ఈ స్టోరీలో ఓ కుక్క తన యజమానిని తుపాకితో కాల్చి చంపింది. అయితే, ఆ కుక్క కావాలని తన యజమానిని కాల్చి చంపలేదు. పొరపాటున అలా జరిగిపోయింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి గత శనివారం వేటకు బయలు దేరాడు.
ట్రక్కులో ముందు భాగంలో ఆ వ్యక్తి కూర్చోగా.. వెనకాల సీట్లో కుక్క కూర్చుని ప్రయాణిస్తున్నారు. అతడు వెనక సీట్లోనే తుపాకిని కూడా ఉంచాడు. ఈ నేపథ్యంలో కుక్క సీటులో అటు,ఇటు తిరగసాగింది. కొద్దిసేపటి తర్వాత తుపాకి ట్రిగ్గర్ మీద కాలు పెట్టింది. ఆ తుపాకి లోడ్‌లో ఉండటంతో ఒక్కసారిగా పేలింది. తుపాకిలోంచి గుండు వేగంగా వెళ్లి ముందు సీట్లో కూర్చున్న యజమానికి తగలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని వేటకు సంబంధించిన ప్రమాదంగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుక్క యజమాని అన్న దానిపై క్లారిటీ లేదని అన్నారు. కాగా, అనుకోని తుపాకి ప్రమాదాలు అమెరికాలో సర్వసాధారణం అయ్యాయి. దీనికి ప్రధాన కారణం దేశంలోని ప్రజలు ఎక్కువగా తుపాకులు వాడుతుండటమే. అంతేకాదు! 2021 సంవత్సరంలో తుపాకి కాల్పుల్లో మొత్తం 500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.