ధనికుల నుంచి మొదలు పేదవారి వరకు కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ముఖ్యంగా పెంపుడు జంతువుగా శునకాన్నీ పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుని మాదిరిగానే దానిపై ప్రేమ చూపిస్తారు. దానికి ఏదైనా జబ్బు చేస్తే తట్టుకోలేరు. మరి అలాంటిది శునకం మీద ఇంత ప్రేమ పెట్టుకొని అవి ప్రాణం వదిలాక వాటి ఆఖరి కార్యం చేసే వాళ్లని చూశారా? వినడానికి చూడటానికి వింతగా ఉందా.. కానీ ఇది నిజం.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెంపుడు కుక్క కి ఇంత అన్నం పెట్టినమా, టైమ్ పాస్ కి ఆ కుక్క మనకు తోడుగా ఉందా, ఆడుకున్నామా.. ఇంటికి సెక్యూరిటి ఉన్నదా లేదా అని చూసుకుంటారు కొంత మంది పెట్ లవర్స్. ఒకవేళ దానికి జబ్బు వస్తే దాని రాత అంతే అన్నట్లుగా విడిచిపెడతారు. లేకుంటే దాని ప్రాణం అదే పోతుందని అని వదిలేస్తారు. సాటి మనిషి చస్తేనే దిక్కులేని ఈ రోజుల్లో వారు పెంచుకున్న శునకానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇంట్లో ఉన్న కుక్క జీవి ఇడిస్తే తల్లడిల్లిపోయారు. వీది మీద తిరిగిన కుక్క లాగా విడిచిపెట్టకుండా ఆచార ప్రకారంగా దానికి ఆఖరి కార్యం చేసారు. చిత్తూరు కాడ ఉండే అన్నోళ్లు కుక్కను 11 ఏండ్లు నుండి పెంచుకుంటున్నారు. ఇక కొన్నిరోజుల క్రితమే బీమారు వచ్చిందంట. ఇంకా ఆ కుక్కకు ఎన్ని హాస్పిటల్స్ తిరిగి చూపించిన ఫలితం లేకుండా పోయింది. కుక్కకు ఆరోగ్యం బాగలేక ప్రాణం వదిలినందుకు చాలా బాదపడ్డారు. ఇంట్లో ఇన్ని రోజులు ఉండి పోయినందుకు మనుషులకు ఆఖరి కార్యం చేసినట్టు కుక్కకి కూడా ఆఖరి కార్యం చేసారు.దీనికి స్రెచర్ పాడగా పెట్టారు. ఇంకా పూలదండలతో ముస్తాబు చేసి ఆఖరి కార్యాన్ని చేసారు. ఇక అంతిమ యాత్రలో స్మశాన వాటికకు తీసుకొని వెళ్లారు. మళ్లీ జన్మ ఉంటే మా ఇంట్లో పుట్టాలి అని కడసారి దుఖంతో శునకానికి వీడ్కోలు పలికాడు ఆ ఇంటి యజమాని.