ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం కొంత కష్టమే. కానీ దీన్ని గుర్తించొచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. అయితే శాస్త్రీయంగా కొన్ని పద్ధతులను అనుసరించి అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించడం తేలికేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరో కూడా తేల్చి చెప్పేశారు. బ్రిటీష్ యాక్టర్ రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందుకోసం సాంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి అయిన గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటి ఫైని వినియోగించారు. ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించేందుకు ఈ పద్ధతిని వాడుతుంటారు. బ్రిటన్‌కు చెందిన కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా అందమైన వ్యక్తుల జాబితాను రూపొందించారు.
అందమైన వ్యక్తుల లిస్టులో రెగె జీన్ పేజ్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం జీన్ పేజ్ కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, దవడ, ముఖం అమరికను పూర్తిగా అంచనా వేశారు. అలా ఆయన ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు డాక్టర్ జూలియన్ డి సిల్వా గుర్తించారు. శాస్త్రీయంగా రెగె జీన్‌కు అందమైన ముఖం, గోధుమ రంగు కళ్లు ఉన్నాయని డి సిల్వా తెలిపారు. కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండటంతో ఆయన ముఖం అందమైనదిగా పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందన్నారు. బ్యూటి ఫై మ్యాపింగ్ టెక్నిక్ ద్వారా ఒక వ్యక్తిని శారీరకంగా అందంగా ఉన్నాడనేందుకు అవసరమైన అంశాలను విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాయని డి సిల్వా పేర్కొన్నారు. ఇక, ప్రపంచంలోనే అందమైన వ్యక్తుల లిస్టులో రెగె తర్వాతి స్థానాల్లో ‘థోర్’ మూవీ ఫేమ్ క్రిస్ హ్యామ్స్‌వర్త్ (93.53 శాతం), బ్లాక్ పాంథర్ యాక్టర్ మిఖాయల్ బి జోర్డాన్ (93.46 శాతం), గాయకుడు హ్యారీ స్టైల్ (92.30 శాతం)ల ముఖాలు ఉన్నట్లు గుర్తించారు.
Regé Jean-Page is the most handsome man in the world, according to science:
1. Regé-Jean Page
2. Chris Hemsworth
3. Michael B. Jordan
4. Harry Styles
5. Jude Bellingham
6. Robert Pattinson
7. Chris Evans
8. George Clooney
9. Henry Golding
10. Dwayne Johnson pic.twitter.com/l6nzXCHn9J— Pop Faction (@PopFactions) January 27, 2023