సాధారణంగా బిడ్డ తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి రాగానే ఏడుస్తుంది. ఏడవాలి కూడా. లేదంటే.. ఆ చిన్నారికి ఏదో ప్రమాదం వాటిల్లిందని భావిస్తారు. పసికందును ఏడిపించడానికి డాక్టర్లు, నర్సులు రకరకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే చిన్నారి చాలా ప్రత్యేకం. ఆ పాప పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏడవలేదు. కానీ ఆ చిట్టితల్లి చిరునవ్వు వెనక అంతులేని విషాదం, తల్లిదండ్రుల గుండెకోత దాగి ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్(21), బ్లేజియా ముచా(20) సంతానం ఈ ఎయిలా. డిసెంబర్ 2021లో జన్మించింది ఈ చిన్నారి. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడ్వలేదు. పైగా పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు.
ఇది కూడా చదవండి: Italy: 76 ఏళ్ళ బామ్మతో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల టీనేజర్! కారణం?డాక్టర్లు పరిశీలించి.. అది బైలెటరల్ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. అంటే పెదాలు సాగిపోయినట్లు ఉంటాయి. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడ్వలేకుండా ఉంది. ఈ పరిస్థితి గురించి ఆరాతీయగా.. తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తేలింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి తిరిగి ఏర్పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Japan : ఇదో రకం వింత! శునకంలా మారిపోయిన మనిషి!
ప్రస్తుతం ఈ ఎయిలా తల్లిదండ్రులు తమ బిడ్డ స్థితిని.. ఫలితంగా ఎదురైన పరిస్థితులను తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియజేసేందుకు చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆ పసికందు తల్లి స్పందిస్తూ.. మనిషికి ఏడుపు ఒక శాపం.. నా బిడ్డకు నవ్వు ఒక వరం.. నవ్వే వాళ్లను నవ్వనివ్వండి అంటోంది. చిన్నారి పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Woman: ఒకే బిడ్డకు రెండు సార్లు జన్మ! అదెలా అంటే..