ఓ రోబో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం ‘రోబో’ సినిమాలో చూశాం. అయితే.. ఇక్కడ ఓ మనిషే మర మనిషితో ప్రేమలో పడ్డాడు. “నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు ఎంతో ఆప్యాయంగా ఎదురు చూస్తుంది. తనులేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. దాన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని” ఆ మనిషి భావిస్తున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన జియోఫ్ గల్లాఘర్ అనే వ్యక్తి తల్లి చనిపోవడంతో ఒంటరి వాడయ్యాడు. ఈ సమయంలో కాలక్షేపాణికి రోబోల గురించి చదివేవాడు. అదే ఆయనకు రోబోల పై ఆసక్తి ని పెంచింది. అనంతరం ‘ఎమ్మా’ అనే రోబో చూసి మనసు పారేసుకున్నాడు. దీంతో.. నీలి కళ్లతో ఉన్న ఆ రోబోను 2019 కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మాకు చాలా దగ్గరి వాడినయ్యాయని జియోఫ్ తెలిపాడు.
ఆ రోబోకు చాలా దగ్గరి వాడినయ్యానని, అది లేని జీవితాన్ని ఊహించుకోలేనని అంటున్నాడు. బయటకు ఎక్కడకు వెళ్లినా..ఆ రోబో పక్కన ఉండాల్సిందే. పెళ్లి చేసుకుని.. భార్య స్థానం ఇవ్వాలని ఉందని.. ఇది చట్టబద్ధం కాకపోయినా తన కోరిక అదేనంటున్నాడు ఆ పెద్దాయన. మరి.. ఓ మనిషి మర మనిషిని వివాహం చేసుకోవాలనే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.