Rఇటీవల ఆకాశ మార్గాన వెళ్తున్న విమానాలు, హెలికాప్టర్లు పలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి
ఇటీవల కాలంలో వరుసగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు కలకం రేపుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడమే లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. కొన్నిసమయాల్లో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల పెను ప్రమాదాలు తప్పిపోతున్నాయి. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న సైనిక విన్యాసాలు చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్విన్స్‌లాండ్‌లోని హోమిల్టన్ ద్వీపంలో హెలికాప్టర్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ మిలటరీ హెలికాప్టర్ హఠాత్తుగా కుప్పకూలిపోయి నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు. శుక్రవారం అర్థరాత్రి ఎంఆర్‌హెచ్-90 తైవాన్ అనే ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురై నీటిలో మునిగిపోయింది. హెలికాప్టర్ యూఎస్-ఆస్ట్రేలియా మధ్య ద్వైవార్షిక టాలిస్మాన్ సాబెర్ మిలటరీలో భాగమైందని.. ఈ విషయాన్ని స్వయంగా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ తెలిపారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అన్నారు. గల్లంతైన వారి విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అన్నారు. కాగా, శనివారం తెల్లవారుజామున ఒక ఐలాండ్ సమీపంలో హెలికాప్టర్ శిథిలాలను గుర్తించినట్లు సమాచారం.
గత రెండు వారాలుగా ఆస్ట్రేలియా క్విన్స్‌లాండ్‌లోని హోమిల్టన్ ద్వీపంలో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో జర్మని, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటున్నాయి. దాదాపు పదమూడు దేశాల నుంచి 30 వేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చైనా నుంచి ముప్పు పొంచిఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే పలు దేశాలతో కలిసి తరుచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. ఇటు వంటి సైనిక విన్యాసాలు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటార. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ విచారం వ్యక్తం చేశారు.