విమానయాన రంగంలో ఊహించని మలుపు ఏర్పాటు అయింది. ఆకాశంలో దూసుకుపోయే విమానాలే ఓ అద్భుతం అంటే దానిని తలదన్నేలా వంట నూనెను ఇంధనంగా ఓ విమానం ఆకాశంలో పొగలు కక్కుతూ పరుగులు తీస్తూ విజయవంతంగా ల్యాండ్ అయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థకు చెందిన AIR BUS A-380 అనే విమానం పూర్తిగా వంట నూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని ముగించింది.
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: మేక మెడలో తాళి కట్టిన యువకుడు..!
ప్రాన్స్ లోని టౌలూస్ బ్లాగ్నక్ నుంచి 27 టన్నులు ఉన్న సస్టైయినబుల్ విమానం మూడు గంటల పాటు ప్రయాణించి నైస్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఇలా విమానం ప్రయాణించటం అద్భుతమంటూ శాస్త్రవేత్తలు కొనియాడుతున్నారు. వంట నూనెతో ప్రయాణించిన విమానంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.