గూడ్స్ రైలు 50 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కి కూడా ఏమీ జరగలేదు. కానీ గ్రామస్తుల ప్రాణాలకు మాత్రం ముప్పు వాటిల్లింది. గూడ్స్ రైలు వల్ల ఆ గ్రామంలోని వాతావరణం విషపూరితమైపోయింది. దీంతో అక్కడి ప్రజలను మంచి నీళ్లు తాగొద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పితే బోగీలు మాత్రమే ప్రమాదానికి గురవుతాయి. కానీ ఈ గూడ్స్ రైలు బండి పట్టాలు తప్పడం వల్ల సంబంధం లేని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక గూడ్స్ రైలు అదుపు తప్పి బోల్తా పడింది. 50 బోగీలు తిరగబడడంతో అందులో ఉండే ప్రమాదకరమైన గ్యాస్ లీకయ్యింది. ఆ గ్యాస్ వాతావరణాన్ని విషపూరితం చేయడంతో అధికారులు ప్రజలను భూమిలోంచి వచ్చే నీరు తాగవద్దునని హెచ్చరించారు. ఈ ఘటన అమెరికాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అమెరికాలోని ఓహైయోలో గూడ్స్ రైలు బోల్తా పడింది. 150 బోగీలతో మాడిసన్ నుంచి బయలుదేరిన రైలు.. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని కాన్వే నగరానికి చేరుకోవాల్సి ఉంది.
అయితే ఒహైయో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్ పాలస్టైన్ అనే గ్రామం వద్ద ఫిబ్రవరి 4న ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. 50 బోగీలు పట్టాలు తప్పి తిరగబడ్డాయి. అయితే 11 బోగీల్లో వినైల్ క్లోరైడ్, బ్యూటైల్ అక్రలేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండడంతో మంటలు రాజుకున్నాయి. విష వాయువులు గాల్లో కలవడంతో నీరు, నేల విషమయమయ్యాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు బాటిల్ లో ఉన్న నీరు మాత్రమే తాగాలని ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ కోరారు. బోగీల్లోంచి వచ్చిన గ్యాస్ లో క్యాన్సర్ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్ క్యాన్సర్ సెంటర్ హెచ్చరించింది. ఈ కారణంగా ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కిలోమీటర్ మేర వరకు గాల్లో చోటు చేసుకుంటున్న మార్పులను అధికారులు గమనిస్తున్నారు.
భూగర్భజలాలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి బోర్ల నీటిని మొదటిసారిగా పరీక్షించగా ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు వెల్లడిలు. మరిన్ని పరీక్షలు చేసి.. ఫలితాలు వస్తే నిర్ణయం తీసుకోవచ్చునని అన్నారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ ప్రజలను బోర్ వాటర్ కాకుండా బాటిల్ నీటినే తాగాలని సూచించారు. మరోవైపు ఆ గ్రామ సమీపంలో ఉన్న నదులు, కాలువల నీటిని కూడా పరీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని 5 రోజుల పాటు అక్కడే ఉంచి తర్వాత ఇళ్లకు పంపారు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.