అతని పేరు రామన్ చందర్ సూద్. దుబాయ్ లో నివాసం ఉంటున్న ఇతని వయసు 70 ఏళ్లు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. ఇక పెద్ద కూతురైన రిచా (36) అంటే చందర్ సూద్ కు అమితమైన ప్రేమ. తన మనవరాళ్లతో సంతోషంగా గడుపుతున్న క్రమంలోనే చందర్ సూద్ ఇంట ఊహించని విషాదం తలుపు తట్టింది. అదే తన పెద్ద కూతురైన రిచా గతేడాది కరోనాతో కన్నుమూసింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి కూతురితో గడిపిన జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. కానీ కూతురు కోసం తండ్రి గుర్తుండిపోయే సాహసాన్ని చేసి ఆమెకు అంకితమివ్వాలనుకున్నాడు.
రామన్ చందర్ సూద్ అనుకున్నట్లుగానే ఏ తండ్రి చేయలేని సాహసాన్ని చేసి చూపించి.. తన కూతురికి అంకితమిచ్చాడు. అసలు చనిపోయిన కూతురి కోసం తండ్రి చేసిన ఆ సాహసం ఏంటి? పూర్తి వివరాలు మీ కోసం. భారత్ కు చెందిన 70 ఏళ్ల రామన్ చందర్ సూద్ ఇండియాలో 40 ఏళ్ల పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగ విరమణ అనంతరం రామన్ చందర్ సూద్ భారత్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన ఇద్దరు కూతుళ్లు కూడా అక్కడే ఉన్నారు. కూతుళ్లకు పుట్టిన పిల్లలతో రామన్ చందర్ సూద్ సంతోషంగా గడుపుతున్న క్రమంలోనే అతని పెద్ద కూతురు రిచా గతేడాది కరోనాతో కన్నుమూసింది.
కూతురు మరణవార్తని తట్టుకోలేని తండ్రి రామన్ చందర్ సూద్ ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక అనుక్షణం కూతురితో ఉన్న జ్ణాపకాలను నెమరు వేసుకుంటూ ఉండేవాడు. ఇక చనిపోయిన కూతురు కోసం తండ్రి ఏదో ఒకటి గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు. ఇక తనకు ఎంతో ఇష్టమైన మౌంట్ క్లైబింగ్ తో చనిపోయిన కూతురుకి గుర్తిండిపోయాలా ఏదైన సాహసం చేసి అంకితమివ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం టాంజానియాలోని మౌంట్ కిలిమాంజారో పర్వాతాన్ని ఎక్కాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. రామన్ చందర్ సూద్ ప్రాక్టీస్ మొదలు పెట్టి ఎట్టకేలకు అక్టోబర్ 15న కిలిమాంజారో ఎక్కి తన విజయాన్ని కూతురు రిచాకు అంకితమిచ్చాడు. రామన్ చందర్ సూద్ తన 70 ఏళ్ల వయసులోనూ అరుదైన ఫిట్ ను సాధించి కిలిమాంజారో 2 నెలల 11 రోజుల పాటు ఎక్కి అరుదైన ఘనతను మూటగట్టుకున్నాడు. ఇలా చనిపోయిన కూతురి కోసం రామన్ చందర్ సూద్ 70 ఏళ్ల వయసులోనూ ఏ తండ్రి చేయలేని సాహసం చేసి చూపించాడు. ఇదే ఇప్పుడు తీవ్ర అంతటా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.