స్పెషల్ డెస్క్- బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వారుండరేమో. ఈ కామెడీ షో ఎంతలా పాపులర్ అయ్యిందో.. ఈ షోలో పాల్గోనే కాంటెస్టెంట్స్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ లో స్కిట్స్ చేసే వారంతా ఇప్పుడు సెలబ్రెటీలు అయ్యారంటే అతియోశక్తి కాదేమో. కొంత మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. చాలా మందికి జబర్దస్త్ షో జీవితాన్నించింది.
ఇక గతంలో జబర్దస్త్ షోలో కేవలం అంతా మగ కంటెస్టెంట్స్ మాత్రమే స్కిట్స్ చేసేవారు. ఆడ క్యారెక్టర్స్ సైతం మగ వాళ్లే వేసేవారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా షోలో మార్పు వస్తోంది. ఆడ క్యారెక్టర్స్ కోసం ఇప్పుడు ఆడవాళ్లే స్కిట్స్ చేస్తున్నారు. ఇలా చాలా మంది లేడీ క్యారెక్టర్స్ తో ఫేమస్ అయిపోతున్నారు. మొన్నా మధ్య వచ్చిన సత్య నుంచి మొదలు రీతూ వరకు జబర్దస్త్ షో ద్వార స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
ఇదిగో ఇప్పుడు ఈ కోవలోకి మరో అమ్మాయి వచ్చి చేరింది. ఆమె మరెవరో కాదు.. షబీనా షేక్. అవును
జబర్దస్త్ షోలో షబీనా షెక్ బాగా పాపులర్ అవుతోంది. షబీనా షేక్ తన అంద చందాలు, హోయలతో జబర్దస్త్ ప్రేక్షకులను మతి పోగొడుతోంది. అంతే కాదు షబీనా సొట్ట బుగ్గలకు ప్రత్యేకంగా అభిమానులున్నారట. చాలా మంది ఆమె సొట్ట బుగ్గలకు ఫిదా అవుతున్నారట మరి. అందుకే షబీనాకు సొట్ట బుగ్గల సుందరి అని పేరు కూడా పెట్టారు.
జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీంలో స్కిట్స్ చేస్తోంది షబీనా షేక్. జబర్దస్త్ కు రాక ముందు నా పేరు మీనాక్షి, కస్తూరి, అత్తారింటికి దారేదీ సీరియల్స్ లో నటించింది షబీనా. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లోను నటిస్తోంది. ఐతే సీరియల్స్ లో నటించినప్పుడు రాని పేరు, జబర్దస్త్ లో రెండు మూడు స్కిట్స్ తోనే వచ్చే సరికి షీబనా సంతోషం అంతా ఇంతా కాదు.