ఐడెంటిటీ కావాలంటే సినిమాలో నటించక్కర్లేదు. సోషల్ మీడియాలో చిన్న వీడియోలు చేసి కూడా ఫేమస్ కావచ్చు. ఇంటర్నెట్ వచ్చాక సోషల్ మీడియా యాప్స్ వచ్చాయి. మంచి కంటెంట్లతో తమలోని టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులను పోగు చేసుకుంటున్నారు. అటువంటి వారిలో..
ఐడెంటిటీ కావాలంటే సినిమాలో నటించక్కర్లేదు. సోషల్ మీడియాలో చిన్న వీడియోలు చేసి కూడా ఫేమస్ కావచ్చు. ఇంటర్నెట్ వచ్చాక సోషల్ మీడియా యాప్స్ వచ్చాయి. చేతిలో సెల్ ఫోన్‌తో వీడియోలు తీసుకుని యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, జోష్, టిక్ టాక్ (ప్రస్తుతం భారత్‌లో బ్యాన్) వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు కొందరు. అలాగే సంపాదన కూడా వస్తుండటంతో మంచి మంచి కంటెంట్లతో తమలోని టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులను పోగు చేసుకుంటున్నారు. షణ్ముఖ్, సిరి, దొర సాయి తేజ, దేత్తడి హారిక వంటి వారు ఈ కోవ కిందకు వస్తారు. అటువంటి వారిలో ఒకరు నవీన్ కుమార్ రెడ్డి.
యూట్యూబ్, ఇన్ స్టాలో ఎమోషనల్ వీడియోస్‌తో ఆకట్టుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ కుమార్ రెడ్డి. ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోతే.. అబ్బాయిలు ఎంత బాధపడతారో.. తన వీడియోల ద్వారా చూపిస్తుంటారు. ప్రేమ గురించి కొటేషన్స్ చెబుతూ.. తన డైలాగ్ డెలివరీలో అమర ప్రేమికుడిగా కనిపిస్తూ ఉంటారు. అమ్మాయి మోసం చేసిందన్న ఆవేదన అతడి నటనలో కనిపిస్తూ ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ లేదా బ్రేకప్‌లో ఉన్న ప్రతి వ్యక్తి ఇతని డైలాగ్స్‌కు కనెక్ట్ అవుతారు. ఒక్కోసారి అతడు కంటతడి పెట్టుకుని, మనకు రప్పిస్తుంటారు. ఇతడి మాటలకు చాలా మంది ఫిదా అవుతుంటారు.
యూట్యూబ్‌తో పోల్చుకుంటే ఇన్ స్టాలోనే ఇతగాడికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 7.73 లక్షల మంది అతడిని ఫాలో అవుతున్నారు. కాగా, ఇప్పుడు ఇతగాడు ఓ ఇంటి కాబోతున్నాడు. దివ్య రెడ్డి అనే అమ్మాయితో ఇటీవల అతడికి నిశ్చితార్థం అయ్యింది. 2019 నుండి ఆమెతో పరిచయం ఉన్నట్లు ఆయన రాసిన పోస్టును బట్టి అర్థమౌతుంది. చాలా మంది ఫాలోవర్స్ అతడిని కంగ్రాట్స్ చెబుతున్నారు. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలతో పాటు ఆమెతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.