ఫిల్మ్ డెస్క్- ఈ మధ్య చిన్న సినిమాలే బాగా సక్సెస్ అవుతున్నాయి. విభిన్న కధాంశాలతో వస్తున్న తక్కువ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చిన్న కధను ఎంచుకుని దాన్ని అద్బుతంగా తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు దర్శకులు. ఇక థ్రిల్లర్, హారర్, కామెడీ జోనర్స్ కలిపి వస్తోంది ఓ సినిమా.
తాజాగా మూడు జోనర్లు కలగలిపిన సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు.. ‘జ’. బిగ్‌బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హిమజ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ప్రీతి నిగమ్, చత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కందుకూరి గోవర్ధన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇక ఇప్పుడు జ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. యువ హీరో సుధీర్‌బాబు జ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. జ సినిమా ట్రైలర్ ఆద్యంతం డైలాగ్లేవీ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసి తెలుసుకోవాలని అంటున్నారు మూవీ మేకర్స్.