ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకోవడం. ఇటువంటి వాటికి మన హీరో హీరోయిన్లేమీ అతీతం కాదు. వారు సైతం తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. అలా వైరల్ గా మారిన ఫోటోల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంతకూ ఆ ఫోటోల్లో ఉన్న అమ్మడు ఎవరో తెలుసా..?
గతంలో అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా లేక అభిమానులు, హీరోల మధ్య రాపో ఉండకపోవచ్చు కానీ, ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడే అవకాశాలుగా మారాయి ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి మాధ్యమాలు. వీటి నుండా సినిమా ముచ్చట్లే. ప్రస్తుతం హీరో హీరోయిన్ల థ్రో బ్యాక్ పిక్చర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. చిన్ననాటి చిలిపి సంగతుల నుండి సినిమాల్లోకి రావడానికి ముందు దిగిన ఫోటోలను మన నటీనటులే సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. ఇలా పంచుకోవడం ఆలస్యం, అలా అభిమానులు వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హాట్ కేక్సులా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. చెప్పలేనంత క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి. అందుకే ప్రతి నటీనటులు సోషల్ మీడియాను ఇటీవల బాగా వినియోగించుకుంటున్నారు. అలా సోషల్ మీడియాను జల్లెడ పడుతుండగా ఓ అమ్మడి ఫోటో దొరికేసింది.
ఈ ఫోటోల్లో కనిపిస్తున్న చిన్నారి ఒక్కరే. ఆమెవే ఈ చిన్ననాటి ఫోటోలు. ఓ ఫోటోలో ఓ దానిలో నీట్లో స్విమ్మింగ్ చేస్తుండగా, మరో ఫోటోలో స్టైలిష్‌గా ఫోజులిస్తుంది. ఇంతకూ ఆ హీరోయిన్ గుర్తు పట్టారా. చిరు మందాహాసాన్ని ఒలికిస్తున్న ఈ చిన్నారి..ఆస్కార్‌లో బెస్ట్ ఒరిజనల్ సాంగ్ గెలుచుకున్న నాటునాటు పాట మూవీ ఆర్ఆర్ఆర్‌లో మన రామ్ చరణ్ పక్కన సీతగా నటించిన ఆలియా భట్. ఆ అవునా, అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా అని అనుకుంటున్నారా. కదా.. అస్సలు పోలికలు లేవు. చిన్నప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్మార్ట్ అయ్యింది. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురుగా సినిమా పరిశ్రమకు వచ్చిన ఈ అమ్మడు తనను తాను నిరూపించుకుంది. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.
హిందీలో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆలియా.. అనంతరం పలు సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హైవే, డియరీ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్ వంటి సినిమాలు చేసింది. అయితే ఆమె యాక్టింగ్ పరంగా ఓ మెట్టు ఎక్కించిన సినిమా అంటే గంగూభాయ్ కతియా వాడి. అందులో ఆమె చేసిన వేశ్య పాత్రలో మరెవ్వరూ ఊహించలేనంతగా నటించింది. తెలుగులో ఆర్ఆర్ఆర్ లో మెరిసింది. మధ్యలో ఓటీటీలో డార్లింగ్స్ అనే సినిమా చేసింది. భర్త రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మస్త్ర మూవీలో నటించింది. ఈ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వీరికీ ఓ తనయ జన్మించింది. ఇప్పుడు పూర్తిగా కుమార్తె ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె బ్రహ్మస్త్ర పార్ట్ 2లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అలియా భట్ సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.