హైదరాబాద్- తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోను చాలా యాక్టీవ్ గా ఉంటారు. అందులోను ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్ లో ఉంటూ, వారి సమస్యలపై చాలా వేగంగా స్పందిస్తారు మంత్రి కేటీఆర్. అందుకే చాలా మంది సోషల్ మీడియా వేధికగా కేటీఆర్ ను సాయం అడుగుతుంటారు.

ఇక నిరంతరం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే కేటీఆర్ కు తీరిక దొరికేది చాలా అరుదు. అలా తీరిక దొరికితే మాత్రం పుస్తకాలు చదువుతుంటానని చాలా సందర్బాల్లో చెప్పారు కేటీఆర్. కేవలం పుస్తకాలను చదవడమే కాదు, తాను చదివిన మంచి పుస్తకాల గురించి అందరితో పంచుకుంచారు కూడా. ఈ క్రమంలో తాను రీసెంట్ గా ఓ పుస్తకం చదివానని, తెలంగాణ పల్లెల జీవితాలను కళ్లకు కట్టినట్టు రచయిత గొప్పగా రాశారంటూ కేటీఆర్ అభినందించారు.
గుండెలో వాన పుస్తకంలో కొన్ని కథలు చదివానని చెప్పుకొచ్చిన మంత్రి కేటీఆర్, నిజంగా కదిలిపోయాను.. మనిషిని వెంటాడే కథలు ఇవి.. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్టు రాసారు పెద్దింటి అశోక్ కుమార్.. రెండు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు.. కంగ్రాట్స్ అన్నా.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గుండెలో వాన కతలు పుస్తకం గురించి చక్కగా వర్ణించారు కేటీఆర్.
‘గుండెలో వాన’ పుస్తకంలో కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను; మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్టు రాసారు పెద్దింటి అశోక్ కుమార్. రెండు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు. Congrats Anna pic.twitter.com/sAFxPrXvaY
— KTR (@KTRTRS) August 6, 2021
