శనివారం ఉదయం కవిత ఈడీ అధికారుల విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటలుగా ఈడీ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను నుంచి సమాచారాన్ని రికవరీ చేసే..
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్‌ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం 12 గంటల ప్రాంతంలో ఈడీ అధికారుల బృందం కవితను విచారించటం మొదలుపెట్టింది. ఆమెతో పాటు లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న మరో తొమ్మిది మందిని కూడా ఏక కాలంలో ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలోనే కవిత, పిళ్లైని కన్‌ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేశారు. ధ్వంసం అయిన ఫోన్లనుంచి డేటాను రికవరీ చేసి మరీ అందరినీ విచారిస్తున్నారు. వీరందరి మధ్యా జరిగిన వాట్సాప్ ఛాటింగ్‌లపై కూడా ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత ఫోన్‌ను సీజ్ చేశారు. కవిత తన డ్రైవర్‌ను ఇంటికి పంపి ఫోన్ తెప్పించగా..
అధికారులు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్నుంచి డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. కాగా, దాదాపు ఐదు గంటల నుంచి కవితను ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. వివిధ రకాల ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. ఈ విచారణ రాత్రి 8 గంటల వరకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉదయం కవిత ఈడీ విచారణకు వస్తున్నపుడు ఆమెతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతలు, కార్యకర్తలు ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అధికారులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. ఆఖరికి ఆమె భర్తను కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. ఆఫీస్ చుట్టు పక్కల 144 సెక్షన్‌ను విధించారు. ఈ నేపథ్యంలోనే కవితను ఆరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.