‘క్యారేషు దాసీ, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ’అన్న పదాలకు కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం తాళిని ఎగతాళి చేస్తున్నారు. పసుపు, కుంకుమల కోసం, భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేసే పతివ్రతలు
‘క్యారేషు దాసీ, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ’అన్న పదాలకు కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం తాళిని ఎగతాళి చేస్తున్నారు. పసుపు, కుంకుమల కోసం, భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేసే పతివ్రతలు ఉన్న ఈ దేశంలో.. పరాయి పురుషుడి కోసం మంగళసూత్రాన్ని తెంచుకునేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు కొంత మంది మహిళలు. భార్య, బిడ్డలకు ఏ ఇబ్బందులు కలగకూడదన్న ఆశతో సమయాన్ని కూడా చూసుకోకుండా కాయం, కష్టం చేస్తున్న భర్తకు చావును బహుమతిగా ఇస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని.. భర్త అడ్డు తొలిగించుకునేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. విశాఖ పట్నం కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్యలో ఇదే జరిగింది.
విశాఖ పట్నంలోని కానిస్టేబుల్ రమేష్ హత్య ఎంతటి కలకలం సృష్టించిందో అందరికీ తెలుసు. భర్తను ప్రియుడి సాయంతో చంపి.. గుండె పోటుగా చిత్రీకరించి, అంత్యక్రియలు చేసేందుకు హడావుడి చేసింది భార్య శివానీ అలియాస్ జ్యోతి. కానీ ఆమె కదలికలపై భర్త కుటుంబ సభ్యులు అనుమానం రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రమేష్.. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2012లో భార్య శివానీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎంవీపీ కాలనీలో ఈ కుటుంబం నివాసముంటుంది. ఈ క్రమంలో భార్య.. స్థానికంగా ఉండే రామారావు అనే ట్యాక్సీ డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా అతడి అడ్డును తొలగించుకోవాలనుకుంది భార్య శివానీ. ప్రియుడి రామారావుతో కలిసి అతడిని అంతమొందించాలని ఫ్లాన్ వేసింది.
దీని కోసం నీలా అనే వ్యక్తికి రూ. 2 లక్షల సుఫారీ ఇచ్చారు రామారావు, శివానీ. ఈ నెల 1వ తేదీన డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన రమేష్.. కాస్తంత మద్యం సేవించాడు. దాన్ని వీడియో తీసి పెట్టుకున్న శివానీ.. ఆ తర్వాత భర్తకు మత్తు ట్యాబెట్లు ఇచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్లిపోవడంతో ప్రియుడు, నీలా సాయంతో దిండుతో ముఖం మీద అదిమి చంపేసింది. వాళ్లు చంపుతుండగా ఆ ఘటనను ఫోనులో రికార్డు చేసింది. అయితే గుండె పోటుతో చనిపోయాడంటూ భర్త తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి ఆ వీడియోను సాక్ష్యంగా కూడా చూపింది. చివరకు ఆమె తీరుపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో..ఎంవీపీ పోలీసులు విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని నిర్ధారణకు వచ్చారు. పెళ్లి సమయంలో రమేష్ కు కట్నం కింద అర ఎకరా పొలం ఇచ్చారని తెలుస్తోంది. శారీరక సంబంధంతో పాటు ఈ ఆస్థి కోసం అతడిని అంతమొందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.