భార్యా భర్తల మధ్య కలహాలు కామన్. ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, కోపతాపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. మళ్లీ కలిసిపోయి సంసారమనే నావకు నెట్టుకు వస్తూ ఉంటారు.
భార్యా భర్తల మధ్య కలహాలు కామన్. ఒకరిపై ఒకరు కోపతాపాలు ప్రదర్శించుకోవడం, అరుచుకోవడం జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. మళ్లీ కలిసిపోయి సంసారమనే నావకు నెట్టుకు వస్తూ ఉంటారు. నూటికి 90 సంసారాలు ఇలానే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో భార్యా భర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరకుంటున్నాయి. కొట్టుకోవడమే కాదూ పదునైన వస్తువులతో దాడి చేసుకోవడం వరకు వెళుతుంది. నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాలో భర్త తారా చంద్ నాయక్ నాలుకను భార్య పుష్పవతి కొరికేసిన సంగతి విదితమే. అయితే కొన్ని రోజుల నుండి తనకు శారీరకంగా వేధిస్తున్నాడని, అసభ్యకర రీతిలో శృంగారం చేయాలంటూ ఇబ్బందికి గురి చేస్తుండటంతోనే.. అతడిని కిస్ చేసే క్రమంలో ఇలా కొరికేశానంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. భర్త మర్మాంగంపై దాడి చేసిందో భార్య. వివరాల్లోకి వెళితే నందిగామలోని ముప్పాళ్ల గ్రామానికి కోట ఆనంద్ బాబుపై అతడి రెండో భార్య వరమ్మ బ్లేడుతో దాడి చేసింది. మొదటి భార్యకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను ఫోనులో చూస్తుండటంతో కోపంతో ఊగిపోయింది. తనను పెళ్లి చేసుకున్నాక.. ఆమె వీడియోలు చూడటమేంటని భర్తను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో వరమ్మ బ్లేడుతో భర్త మర్మాంగాలపై దాడి చేసింది. తీవ్రంగా రక్తస్రావమైన అతడిని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడికి నాలుగు కుట్టు పడ్డాయి. ఆ తర్వాత డిశ్చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆనంద్ బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.