మనం సమ్మర్ హాలీడేస్, సంక్రాంతి సెలవులు, క్రిస్ మస్ సెలవులు విని ఉంటాం. మరి.. ఎప్పుడైనా లవ్ హాలిడేస్ గురించి విన్నారా? లవ్ హాలీ డేస్ ఏంటని ఎక్కువగా ఆలోచించకుండా ముందుగా ఈ ఆర్టికల్ చదివేయండి.
మాములుగా సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు ఉంటాయి. కానీ, మీరు ఎప్పడైనా లవ్ హాలీ డేస్ గురించి విన్నారా? లవ్ హాలీడేస్ ఏంటని అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే. కొన్ని కాలేజీలు విద్యార్థులకు లవ్, రొమాన్స్ లైఫ్ మీద కాస్త ఫోకస్ పెట్టండి అంటూ హాలీ డేస్ ను ప్రకటిస్తున్నాయి. వినటానికి ఏదోలా ఉన్న ఇది నిజం. అసలు లవ్ హాలీడేస్ ఏంటి? కాలేజీ యాజమాన్యాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదైనా ఉంది అంటే అస్సలు ఆలోచించకుండా చైనా పేరు చెప్పక తప్పదు. అలాంటి చైనా ఇప్పుడు జనాభా పెరుగుదలకు సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది. కొత్తగా ఇప్పటి విద్యార్థులకు లవ్ హాలిడేస్ పేరుతో సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించడం విశేషం. ఈ నిర్ణయంతో కాలేజీ స్టూడెంట్స్ ఎగిరిగంతేస్తూ.. చదువును పక్కనపెట్టి ప్రేమించుకునే పనిలో నిమిగ్నమవుతున్నారు. అయితే జనాభా పెరుగుదలను ప్రొత్సహిస్తూ చైనా తాజాగా తీసుకొచ్చిన లవ్ హాలిడేస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.