అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం అంచనా ప్రకారం భారత దేశ జనాభా 130 కోట్ల వరకు ఉంటుంది. అయితే భారత్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇక పక్కనే ఉన్న చైనా ఉంది. చైనాలో కూడా అత్యధిక జనాభా ఉంది. ఈ క్రమంలోనే అటు భారత్ లాగానే చైనా కూడా తమ దేశంలో జనాభా సంఖ్య తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలనే సరి కొత్త చట్టాన్ని కూడా పెట్టింది. చైనాలో ఒక జంట కేవలం ముగ్గురిని మాత్రమే కనేందుకు అక్కడి చట్టం ప్రకారం వీలుంది. ప్రతి ఒక్కరు ఇక ఈ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పట్ల అక్కడి ప్రభుత్వం ఎంతో కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం సూచించిన విధంగా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎక్కువ మంది పిల్లలను కన్నందుకు చైనా ప్రభుత్వం ఊహించినంత పైన్ వేసి 50 ఏళ్ల రైతుకి షాక్ ఇచ్చింది.
ఇటీవల ఏకంగా ఎనిమిది మంది సంతానం కి జన్మనిచ్చిన ఒక రైతుకు మూడు కోట్ల జరిమానా విధించింది ప్రభుత్వం. అయితే మొదటి భార్యకు ఐదుగురు సంతానం కాగా అబ్బాయిలు పుట్టడం లేదు అని మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు ఆ రైతు. ఇక రెండవ భార్యకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టారు. మొత్తంగా అతని సంతానం 8 మంది అయ్యారు. దీంతో మూడు కోట్లు జరిమానా విధించింది ప్రభుత్వం. వారి దీన పరిస్థితిని అర్థం చేసుకుని 10 లక్షలు తగ్గించింది.