స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ లో చాలా వరకు దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక సమాన్య ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు మెల్లి మెల్లిగా అదుపులోకి వస్తున్నాయి. మళ్లీ ఎప్పటిలా జన జీవనం పునరుత్తేజం అవుతోంది. ఐతే కొన్ని దేశాల్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు.
మన దేశంలోలాగే విదేశాల్లోనూ వ్యవసాయ కూలీల కొరత కనిపిస్తోంది. విదేశాల్లో జనాభా కొరతతో పాటు అనేక కారణాలతో కూలీలు దొరకడం లేదు. బ్రిటన్‌లో ఓ ప్రముఖ కార్పోరేట్ కంపెనీకి కూలీల సమస్య వచ్చిపడింది. దీంతో సదరు కంపెనీ సంవత్సరానికి ఏకంగా 62 వేల పౌండ్స్ అంటే మన దేశ కరెన్సీలో 63 లక్షల రూపాయల మేర జీతం చెల్లిస్తామని ప్రకటించింది. ఇంకేముంది ఈ కంపెనీ ఇచ్చిన భారీ సాలరీ ఆఫర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
లండన్ లోని టీహెచ్ క్లెమెంట్స్ అండ్ సన్ లిమిటెట్ కంపెనీ పెద్ద ఎత్తున కూరగాయల్ని పండిస్తూ ఉంటుంది. ఈ కంపెనీ లండన్ లోని సూపర్ మార్కెట్లకు తాజా కూరగాయలు, పండ్లను సరఫరా చేస్తుంది. తాజాగా తమ కంపెనీలో పని చేసేందుకు వర్కర్లు కావాలి అని జాబ్ ఆఫర్ ప్రకటించింది.తమ వ్యవసాయ క్షేత్రంలో క్యాబేజీ కొయ్యడానికి ఫీల్ట్ ఆపరేటర్లు కావాలని కంపెనీ ప్రకటనో పేర్కొంది. ఉద్యోగంలో చేరే వారు తోటలో క్యాబేజీ, బ్రకోలీ కొయ్యాలన్నమాట.
ఈ పకంపెనీ తమ తోటలో పని చేసేవారికి గంటకు మన దేశ కరెన్సీలో 3,035 రూపాయలు చెల్లిస్తుంది. ఒక్కొక్కరు రోజూ 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఓ వారం పని చేస్తే 12 వేల రూపాయలు వస్తాయి. అదే ఓ నెల రోజుల పాటు పని చేస్తే 4,800 పౌండ్స్ అంటే మన దేశ కరెన్సీలో 4,85,700 రూపాయలు చెల్లిస్తారు. అంటే యేడాది పాటు ఈ కంపెనీ తోటలో పని చేస్తే అక్షరాల 63లక్షల రూపాయల జీతం పొందవచ్చన్నమాట. మరింకెందుకు ఆలస్యం అవకాశం ఉంటే వెంటనే ట్రై చేయండి.