హిమాచల్ ప్రదేశ్- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్లిన వారు మల్లి క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండాపోయింది. విశాలమైన రోడ్లు, వాహనాల వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. ఇక ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతే, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంత రాష్ట్రాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి ప్రమాదాల్లో డ్రైవర్ల అప్రమత్తతో ప్రాణ నష్టం జరగకుండా ఆపవచ్చు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ తన చాకచక్యంతో 30 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాడు. పాంవటా షిలాయీ నేషనల్ హైవేపై బొహరాఢ్ సమీపంలో ఒక బస్సు అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోబోయింది.
పాంవటా షిలాయీ నేషనల్ హైవేపై ఈ బస్సు వెళుతున్న సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి, రోడ్డు పక్కగా ఉన్న ఫుట్‌పాత్ గోడ దాటుకుని, లోయ అంచునకు చేరి గాలిలో వేలాడసాగింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రయాణీకులంతా భయంతో పెద్దఎత్తున అరిచారు. బస్పులోని సగభాగం లోయవైపు వేలాడుతూ కిందకు మీదకు ఊగుతూ ఉంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితిలోనూ డ్రైవర్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా బస్సులోని బ్రేక్‌పై తన కాలు అదిమిపెట్టి, నిలుచున్నాడు. అందుకే బస్సు వెనుక చక్రాల కదలకుండా రోడ్డును పట్టుకుని నిలుచుంది.
ఆ క్రమంలో ప్రయాణీకులంతా నెమ్మదిగా బస్సులోంచి దిగి, తమ ప్రాణాలకు కాపాడుకోగలిగారు. బస్సులోని 30 మంది ప్రయాణీకుల ప్రాణాలు పోకుండా కాపాడాడు. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను వారు అభినందనలతో ముంచెత్తారు.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.