అమెరికా- బుల్లెట్ బండి పాట.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాంగ్ గురించే చర్చ. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అంటూ మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ చేయిన డ్యాన్స్ తో ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి మొదలు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ పాటే ట్రేండ్ అవుతోంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడిన ఈ పాట చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆమె తరువాత చాలా మంది బుల్లెట్ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు.
ఇప్పుడు బుల్లెట్ బండి పాట మన దేశం ఎల్లలు దాటి, విదేశాలకు చేరింది. విదేశాల్లోని తెలుగు వారిని కూడా ఈ పాట బాగా అలరిస్తోంది. తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉండే నైనిక అనే ఎన్నారై పాప సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసింది. నైనిక డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో బాగా వైరల్ అవుతోంది.
ఈ ఎన్నారై పాప డ్యాన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అంటూ నైనిక వేసిన స్టెప్పులను అంతా తెగ మెచ్చుకుంటున్నారు. ఒకానొక దశలో ఈ పాటపై నవ వధువు సాయిశ్రియ చేసిన డ్యాన్స్‌ను కూడా నైనిక మరిపించేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫెస్ బుక్ లో ఈ నైనిక డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 1లక్షకు పైగా వ్యూస్ రాగా, ఐదువేల లైక్స్ వచ్చాయి.
ఎన్నారై చిన్నారి నైనిక డ్యాన్స్ ను మెచ్చుకుంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు చాలా బాగా డ్యాన్స్ చేశావని అంటే, మరి కొందరు ఎనర్జీ లెవల్ సూపర్ అని అంటున్నారు. అంతే కాదు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ ఇరగదీశావు అని, జూనియర్ సాయి పల్లవి అని.. చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి మీరు కూడా చిన్నారి నైనిక డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేయ్యండి.