పొలిటికల్ డెస్క్- నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోను సెన్సేషనే. బాలయ్య బాబుకు ముక్కు మీద కోపం మాత్రమే.. కానీ చిన్నపిల్లాడి మనస్థత్వం, చాలా మంచివారని చెబుతారు ఆయన సన్నిహితులు. అవును బాలకృష్ణ ఆవేశం వస్తే ఆపుకోలేరు, మనసులో ఏ ముందో అదే మాట్లాడే బోలా మనిషి. మొన్ననే 61వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న బాలయ్య బాబు.. తన అభిమాన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతూవస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ దేశాల్లోని ఆయన అభిమానులు కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమేరకు అభిమానులతో బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని అభిమానులతో నిర్వహించిన సమావేశంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
బాలకృష్ణ ఏపీ రాజకీయాల నుంచి మొదలు అమెరికాలో రాజకీయల వరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ మధ్యలో చనిపోతే భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అవుతారని బాలయ్య అన్నారు. అమెరికాకు భారతీయులు ప్రెసిడెంట్ అవుతారని నేను ఎప్పుడో చెప్పాన్న ఆయన, బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్లుగా నేను కూడా ముందుగానే ఊహించానని అన్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వ్యక్తులు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తెలుగు దేశం పార్టీలో తాను ఎవడి అనుమతి తీసుకోనక్కర్లేదన్న బాలకృష్ణ, త్వరంలోనే రంగంలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు.
తెలుగు దేశం పార్టీలో మొదట్లో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని బాలయ్య వ్యాఖ్యానించారు. ఇక ముందు పార్టీలో యువతను నేనే ముందుకు నడిపిస్తానని, ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు కూడా చెప్పానని అన్నారు. అంతటితో ఆగకుండా ఇకపై చెప్పడాలు, అడిగి పర్మీషన్ తీసుకోవడాలు ఉండవని, స్వయంగా తానే రంగంలోకి దిగే రోజులు దగ్గరపడ్డాయని బాలకృష్ణ చెప్పారు. టీడీపీలో ఎవడి పర్మీషన్ అక్కర్లేదు, ఎవడి ఆమోద ముద్ర నాకు అవసరం లేదు అంటూ కామెంట్ చేశారు. బాలకృష్ణ సంచల వ్యాఖ్యలపై తెలుగుదేశంలోనే కాదు, అధికార వైసీపీ, బీజేపీ పార్టీలలోను జోరుగా చర్చ జరుగుతోంది. ఏ ఉధ్దేశ్యంతో బాలయ్య ఈ కామెంట్స్ చేశారన్న ప్రశ్న అందరిలోను మెదులుతోంది.