ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కక్కరు ఇంటివారయిపోతున్నారు. అదేనండీ మన తెలుగు హీరోలంతా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయ కూడా చేరపోయారు. అవును కార్తికేయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమేరకు ఆయన నిశ్చితార్ధం కుడా అయిపోయింది. తన స్నేహితురాలు లోహితతో ఎంగేజ్ మెంట్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా కార్తికేయ తెలిపారు.
వరంగల్ నిట్‌లో 2010లో మొదటి సారి లోహితను చూశానని చెప్పుకొచ్చారు కార్తికేయ. అదిగో అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ స్నేహబంధం ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోందని చెప్పారు. నా ఫ్రెండ్ నా భాగస్వామిగా అయిందంటూ కార్తికేయ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా తన లవ్ స్టోరీని ఒక్కసారిగా కార్తికేయ బయటపెట్టేసరికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు.
కార్తికేయ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి అయితే నో కామెంట్ అంటూ నోర్ముసుకున్న ఎమోజీని షేర్ చేశారు. దీనికి స్పందించిన కార్తికేయ.. అంతా మీరు చూపించే బాటే సార్ అంటూ రిప్లై ఇ్చచారు. ఇక జబర్దస్ట్ యాంకర్ అనసూయ, ఆర్ఎక్స్-100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం కార్తికేయ ఎంగేజ్ మెంట్ పై స్పందించారు.
జబర్దస్త్ బ్యూటీ అనసూయ స్పందిస్తూ.. ఎంత బావున్నారో అని కామెంట్ చేస్తూ, కార్తికేయకు కంగ్రాట్స్ చెప్పారు. అనసూయ కాంప్లిమెంట్ కు థ్యాంక్స్ అని కార్తికేయ రిప్లై ఇచ్చేశారు. ఇక పాయల్ రాజ్ పుత్ స్పందిస్తూ.. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతోన్నాను.. దేవుడు చేసిన జంట అంటూ కార్తికేయకు శుభాకాంక్షలు చెప్పారు. అన్నట్లు చావు కబురు చల్లగా సినిమాలో అనూయ కార్తికేయతో స్పెషల్ సాంగ్ చేశారు. అందుకే వీరిద్దర మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life..
From 2010when i first met #Lohitha in nitwaranagal to now and many more such decades.. pic.twitter.com/xXYp7pcH4K— Kartikeya (@ActorKartikeya) August 23, 2021
Can’t put in words how elated i am .. god bless both of u .. “Rab me banadi Jodi “ ♥️🌸♥️
— paayal rajput (@starlingpayal) August 23, 2021