ఫిల్మ్ డెస్క్- భూమిక చావ్లా.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఇప్పుడంటే అక్కా, వదిన పాత్రల్లో నటిస్తోంది కానీ, ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమిక. మెగాస్టార్ చిరంజీవి సహా అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఒక్క తెలుగులోనే కాదు, దక్షిణాది బాషలతో పాటు, బాలీవుడ్ లోను నటించి మెప్పించింది భూమిక.
ఇక ఇప్పుడు లేటు వయసులోను నాకేం తక్కువ అంటోంది భూమిక. వేసేది వదినా, అక్క పాత్రలైనా ఈ వయస్సులోనూ యంగ్ హీరోయిన్లతో పోటీపడుతోంది. తాజాగా స్విమ్ సూట్ తో స్విమ్మింద్ ఫూల్ లో ఉన్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది భూమికా చావ్లా. ఇటీవల కాలంలో అనేక మంది యంగ్ హీరోయిన్లు స్విమ్ సూట్‌లో సందడి చేస్తున్నారు.
యంగ్ హీరోయిన్లకు ధీటుగా, వారికి షాకిచ్చేలా స్విమ్ సూట్ లో సందడి చేసింది భూమిక. 43 సంవత్సరాల వయసులో భూమిక స్విమ్ సూట్ లో కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన భూమిక, ఇలా లేటు వయసులో స్విమ్ సూట్ లో ప్రత్యక్ష్యం అయ్యే సరికి స్టన్ అయిపోతున్నారు.
అడపా దడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషిస్తున్న భూమిక, తనలో ఇంకా సత్తా తగ్గలేదు, ఏ పాత్రకైనా సిద్దమన్న సంకేతాలివ్వడానికే ఇలా స్విమ్ సూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా భూమిక స్విమ్ సూట్ వీడియో సోషల్ మీడియాలై వైరల్ అవుతోంది.