విద్య ఎవరికీ సొంతం కాదు.. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివే వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అలాంటి వారు రాష్ట్ర స్థాయిలో రికార్డులను అందుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇలా చదువుపై మమకారంతో పోటీపడి చదువుతున్న ఎంతోమంది ఇప్పుడు ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే శరీరంలోని అన్ని అవయవాలు బాగున్న కొంతమంది చదువుని అస్సలు లెక్కచేయరు.
కానీ బిహార్ కు చెందిన ఓ పదేళ్ల బాలిక మాత్రం ఒకే కాలుతో రోజు 1 కిలీమీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు గెంటుకుంటూ వెళ్తూ తిరిగి ఇంటికి వస్తుంది. ఆ బాలికకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఫతేపూర్. ఇదే ప్రాంతానికి చెందిన సీమా మాంజీ అనే ఓ 10 ఏళ్ల బాలిక గత రెండేళ్ల కిందట ఓ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ బాలిక ఎడమ కాలును పూర్తిగా కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Teacher: పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ ఘన కార్యం! పూటుగా మద్యం తాగి వచ్చి..
అయితే ఆ బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత స్కూల్ కు ఎలా వెళ్లాలని అనేక ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక చివరికి చేసేదేం లేక ఆ బాలిక ఉన్న ఒకే ఒక్క కాలుతో రోజు ఒక కిలోమీటర్ మేర గెంతుకుంటు వచ్చి పోతుంది. ఈ బాలిక ప్రయత్నాన్ని చూసిన స్థానికులు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలా చదువుపై ఆ బాలిక ఇంతటి శ్రద్దను చూపిస్తుండడంతో రేపటి రోజుల్లో చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అదిరోహిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆ బాలికకు ఉన్న వైకల్యాన్ని అస్సలు లెక్కచేయకుండా క్రుంగిపోకుండా ముందుకు వెళ్తోంది. అయితే ఆ బాలిక అలా రోజూ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది. చదువుపై ఆ చిన్నారి ఎంతో పోరాటం చేస్తుందని అందరు మెచ్చుకుంటున్నారు. చదువు కోసం చిన్నారి పడుతున్న ఈ కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.