CWC: సాధారణంగా వంటల ప్రోగ్రామ్ ఎందుకు చూస్తాం?.. 80 శాతం మంది వంటలు నేర్చుకోవటానికి ప్రోగ్రామ్ చూస్తే.. మిగిలిన 20 శాతం మంది సరదా కోసం చూస్తుంటారు. కానీ, ఓ మహిళ తాను తల్లి కావటానికి ఓ ప్రముఖ వంటల ప్రోగ్రామ్ చూసిందట.. అలా చూడ్డం వల్ల తల్లి కూడా అయిందట. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. స్వయంగా సదరు వంటల ప్రోగ్రామ్ యాంకర్. తన షో చూడ్డం వల్ల ఓ మహిళ తల్లైందని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ఇంతకీ సంగతేంటంటే.. తమిళనాట ‘‘కుకు విత్ కోమలి’’ అనే వంటల ప్రోగ్రామ్ చాలా ఫేమస్. ప్రముఖ చెఫ్ వెంకటేష్ భట్ దీని యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. వంటతో పాటు హాస్యాన్ని జోడించటంతో ఈ షో సూపర్ హిట్ అయింది. షోకు ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు.
స్టార్ హీరోలు సైతం ఈ షో ద్వారా తమ కొత్త సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి ఎదిగింది. ప్రతీ ఎపిసోడ్‌కు ఎవరో ఒక గెస్ట్ వస్తూనే ఉంటారు. తాజా ఎపిసోడ్‌లో నారప్ప ఫేమ్ అమ్ము అభిరామి, ప్రముఖ నటి విద్యులేఖ రామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షో ప్రాముఖ్యతను వివరిస్తూ వెంకటేష్ ఓ సంఘటనను షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ మీరు నమ్మరు కానీ, చాలా మంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ షో చూసి ఈ సంవత్సరం తాను గర్భవతిని అయ్యానని ఓ మహిళ చెప్పింది. ఆమెకు ఎనిమిదేళ్లుగా పిల్లలు లేరట. ఐవీఎఫ్ చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లిందట. అక్కడ బిడ్డతో వచ్చిన ఓ మహిళ ఆమెతో ఓ మాట చెప్పిందట.గత సంవత్సరం ఆమె కూడా పిల్లలు లేకుండా బాధపడ్డానని, ‘కుకు విత్ కోమలి’ షో చూసి, తన బాధలన్నీ మర్చి పోయి చికిత్సకు వచ్చానని, ప్రస్తుతం తన చేతిలో ఓ బిడ్డ ఉందని చెప్పిందట. ఈమెను కూడా కచ్చితంగా షో చూడమని, పిల్లలు పుడతారని అన్నదట… మీరు నమ్మరు ఇప్పుడు ఆ మహిళ గర్భవతి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న విద్యులేఖ ‘‘గూస్ బమ్స్ వస్తున్నాయి’’ అని అన్నది. వెంకటేష్ భట్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు దీనిపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ట్రోలర్స్ దారుణంగా విరుచుకుపడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bigg Boss: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం!