ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమాను పీరియాడిక్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించగా.. స్టార్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే.. మార్చి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో RRR హీరోలు, దర్శక నిర్మాతలు పాల్గొంటున్నారు.
ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదివరకెన్నడూ చేయని విధంగా.. దేశవ్యాప్తంగా RRR ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే.. ప్రమోషన్స్ లో ట్రిపుల్ ఆర్ టీమ్ అందరూ కనిపిస్తున్నారు కానీ.. ఈ సినిమాకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ కి సంబంధించి ఏ ఒక్క ఇంటర్వ్యూలో, ఏ ప్రెస్ మీట్ లో ఆయన కనిపించలేదు.ఈ క్రమంలో రాజమౌళికి ఇన్ని బ్లాక్ బస్టర్ కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్.. బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో అద్భుతమైన ప్రసంగాలతో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎక్కడ? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. విజయేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. వయస్సు రీత్యా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన RRR ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన త్వరగా కోలుకొని మరిన్ని బ్లాక్ బస్టర్ కథలు ఇండస్ట్రీకి ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.