కింగ్ నాగార్జున. మన్మధుడిగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. శివ నుంచి కూలీలో ప్రతినాయకుడిగా అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకున్న నాగార్జున ఒకసారి హోటల్ కారిడార్ క్లీన్ చేశాడంటే నమ్మగలరా..అసలేమైంది, ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు మీ కోసం.
కింగ్ నాగార్జున గురించి ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇప్పుడు రివీల్ అవుతున్నాయి. ఈ సీక్రెట్స్ బయటపెడుతున్నది కూడా అతని క్లోజ్ ఫ్రెండే. ఆ క్లోజ్ ఫ్లెండ్ మరెవరో కాదు..టాలీవుడ్ నటుడు జగపతి బాబు. అవును..ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటి నుంచి కాదు చాలా కాలం నుంచి. అందుకే బుల్లితెర యాంకర్‌గా కొత్త గెటప్ ప్రారంభించిన జగపతి బాబు తన షో జయమ్ము నిశ్చయమ్మురాలో ముందుగా ఫ్రెండ్‌నే కూర్చోబెట్టాడు. మొదటి ఎపిసోడ్ నాగార్జునతోనే మొదలెట్టాడు. ఈ షోలోనే నాగార్జున గురించి ఎవరికీ తెలియని విషయాలు, ఇతర ఆసక్తికర అంశాలు బయటికొచ్చాయి.
సింగపూర్ హోటల్‌లో క్లినింగ్ చేసిన నాగార్జున
కింగ్ నాగార్జున గురించి జగపతి బాబు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఓసారి నాగార్జున సింగపూర్ హోటల్‌ను క్లీన్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను నాగార్జున ఒకసారి సింగపూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ ఫైన్ స్టార్ హోటల్‌ను అశుభ్రం చేశామన్నాడు. దాంతో ఆ హోటల్ యాజమాన్యం నాగార్జున చేతికి మాప్ ఇచ్చి క్లీన్ చేయించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు జరిగిన ఆ ఘటన తనకు కొద్దిగా గుర్తుందని నాగార్జున బదులిచ్చాడు.
వాస్తవానికి జగపతి సినీ రంగంలో రావడానికి కారణం నాగార్జునే. అంతకుముందు జగపతి బాబు విశాఖపట్నంలోని ఓ ఫర్మీచర్ షాపులో చేస్తుండేవాడు. ఖాళీ సమయాల్లో సినిమా షూటింగులు చూస్తుండేవాడట. నాగార్జున కారణంగా సినిమాల్లోకి వచ్చానని, అతని నటన, స్టైల్ చూసి ఆకర్షితుడయ్యానంటున్నాడు జగపతి బాబు.