తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ఎంత స్పెషల్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. విన్నర్స్ విషయం పక్కన పెడితే.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ సీజన్ 5లో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకుంది. అలాగే సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే.. ప్రియాంక సింగ్ అందంతో పాటు అందమైన గేమ్ ప్లేతో ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
దాదాపు బిగ్ బాస్ హౌస్ లో 13 వారాల పాటు ప్రియాంక ఉండగలిగింది అంటే.. ఎంత బ్యాలెన్సింగ్ గా గేమ్ ఆడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక త్వరలో బిగ్ బాస్ కొత్త సీజన్ OTT లో ప్రారంభం కాబోతుంది. మరి ఈసారి ట్రాన్స్ జెండర్ కోటాలో బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టేది ఎవరు? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.తాజా సమాచారం ప్రకారం.. హిజ్రా ఫౌండర్, స్పోక్ పర్సన్ చంద్రముఖి బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న షో కోసం చంద్రముఖిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని టాక్ నడుస్తుంది. అయితే చంద్రముఖి ఓటీటీకి కాకుండా సీజన్ 6కి వెళ్తారని సందేహాలు వ్యక్తమవుతుండగా.. ఈ విషయం పై చంద్రముఖి స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా వెళ్తాను. సోషల్ మీడియాలో నన్ను చాలామంది.. అక్కా బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చు కదా! అని అడుగుతుంటారు. బిగ్ బాస్ సీజన్ 3 టైంలోనే నన్ను సంప్రదించారు. ఆ టైంలో నా పరిస్థితి బాలేక బిగ్ బాస్ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు కొత్త సీజన్ లో ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. అలాగే మాలాంటి వారిపై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. సో కాల్ రావాలే గాని బిగ్ బాస్ హౌస్ లో వాలిపోయేందుకు సిద్ధంగా ఉందని కంఫర్మ్ చేసింది. మరి ట్రాన్స్ జెండర్ చంద్రముఖి బిగ్ బాస్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.