Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ సినిమా హీరో విశ్వక్ సేన్‌పై హెచ్‌ఆర్సీలో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వక్ సేన్ స్పందించారు. ఓ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లాయర్ అరుణ్ కుమార్ ఫ్రాంకులు చేసే వారందరిపై కేసు పెట్టారు. నేను తట్టుకోగలను.. కానీ, ఫ్రాంకులు చేసే మిగితా వాళ్లు చిన్న మనుషులు.. కేసులు, పిటిషన్లు అంటే వాళ్లు తట్టుకోలేరు. మిగిలిన వాళ్ల మీద ఉన్న కేసులు తీసేయండి. అది మంచి పద్దతి కాదు. మేము చేసిన ఫ్రాంక్ కేవలం ఫన్ కోసమే.. అది కూడా మా ఇంటి దగ్గర చేశాం.
అక్కడి వాళ్లంతా నాకు తెలిసిన వాళ్లే. వాళ్లంతా దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. మీడియా వాళ్లు చెబుతున్నట్టు చిర్రెత్తిపోలేదు, వెర్రెత్తిపోలేదు. నీళ్లను పట్టుకుని పెట్రోల్ అంటున్నారు. అరుణ్ కుమార్ కూడా పెట్రోల్ అని కేసు పెట్టారు. నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఏమైనా చేస్తా. సినిమా ఎంత మందికి వెళ్లాలా అన్న ఆలోచనతో సరిగా పడుకోను. ప్రమోషన్ కోసం దుర్గమ్మ గుడికి వెళ్లాను. రంజాన్ సందర్భంగా ఓ మసీదుకు కూడా వెళ్లాను. ఇవి ఎవరికీ పట్టవు. మంచి విషయాలు ఎవరికీ పట్టవు. ఐడోంట్ కేర్! నా సినిమాను ప్రమోట్ చేయటానికి ఏదైనా చేస్తా.
మిగిలిన ఫ్రాంకుల మీద వేసిన పిటిషన్ వెనక్కు తీసుకోండి. నలుగురికి ఉపాది కల్పించే జాబు నావల్ల డ్యామేజ్ అయితే, నేను తట్టుకోలేను. ఏదున్నా నేను, మీరు చూసుకుందాం’’ అని అన్నారు. కాగా, విశ్వక్ సేన్, రుక్సర్ దిల్హాన్ జంటగా నటించిన ‘ అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ‘శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్’పై దిల్ రాజు నిర్మించారు. మే 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఫ్రాంక్ వీడియోపై విశ్వక్ సేన్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vishwak Sen: కష్టాల్లో హీరో విశ్వక్ సేన్! HRC లో ఫిర్యాదు!