థియేట్రికల్ సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మధ్య విడుదలైనా.. సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చినా.. చివరికి బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఏంటనేది చూస్తుంటారు ప్రేక్షకులు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు మధ్య విడుదలైనా.. సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చినా.. చివరికి బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఏంటనేది చూస్తుంటారు ప్రేక్షకులు. సినిమా ఫలితం ఏదైనా ఆడియెన్స్ లో సినిమాలపై ఉండే ప్రియారిటీస్ మారుతూ వచ్చాయి. ఇదివరకు సినిమాలు థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ పై చూడాలని భావించేవారు. కానీ.. ఓటిటిలు వచ్చాక.. థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు తగ్గిపోయాయి. ఎందుకంటే.. ఎలాగో నెలా రెండు నెలల్లో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి కదా! అనే ధీమా కూడా ఓ కారణం అనుకోవచ్చు.
ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ అబ్బూరు మురళీ కిషోర్ తెరకెక్కించారు. రొమాంటిక్ లవ్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. కాగా ఈ సినిమాని ఉగాది సందర్భంగా మార్చి 22న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లందుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత వరుసగా ప్లాప్స్ ఖాతాలో వేసుకున్నాడు. టాక్ బాగున్నా కమర్షియల్ గా ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా డీసెంట్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఓటీటీ టాక్ ఎలా ఉంటుందో అనేది చూడాలి. మరి వినరో భాగ్యము విష్ణుకథ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.