శుక్రవారం మ్యారేజీ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫ్లూటుతో ఆ రూములోకి వచ్చాడు.
లేడీ అమితాబ్ బచ్చన్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌లు 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట తమిళనాడులోని మహాబలిపురంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ జూన్ 9కి వారి పెళ్లి అయి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో నయన్-విగ్నేష్‌లు నిన్న వివాహ వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విగ్నేష్ తన భార్యకు సరప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్‌ప్రైజ్‌తో నయనతార కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భర్తను హత్తుకుని మురిసిపోయారు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే..
శుక్రవారం మ్యారేజీ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫ్లూటుతో ఆ రూములోకి వచ్చాడు. ఫ్లూటును ఎంతో అద్భుతంగా వాయిస్తూ ఉన్నాడు. ఆ వేణు గానం విని నయనతార మైమరచిపోయింది. కన్నీళ్లతో భర్తను హత్తుకుంది. కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయింది. ఆ రూము మొత్తం కొంత సేపు ఎమోషనల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, నయనతార, విగ్నేష్ శివన్‌లు 2015లో వచ్చిన ‘నానుం రౌడీదా’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. విగ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు కాగా.. నయనతార హీరోయిన్. దాదాపే ఏడు సంవత్సరాల తర్వాత 2022లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరూ సరోగసి ద్వారా పిల్లల్ని కనడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. మరి, నయన్‌కు విగ్నేష్ శివన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🎉Celebration 🫶🏻 #WikkiNayan pic.twitter.com/5gRe0NZnbZ
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2023