మెగా కోడలు ఉపాసన కొణిదెల కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. తన కుటుంబసభ్యలను కలిసేందుకు చెన్నై వెళ్లాలనుకున్నారు. తాతయ్య వాళ్లను కలవాలి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ టెస్టు చేయించుకోగా కరోనా నిర్ధరణ జరిగినట్లు తెలియజేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత వారం కొవిడ్ బారిన పడినట్లు.. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నట్లు తెలియజేశారు. కాస్త గ్యాప్ తర్వాత తిరిగి రాక్ అండ్ రోల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: వింత వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్!
తనకు కరోనా సోకినట్లు పెట్టిన పోస్టులో ఉపాసన ఏం చెప్పారంటే.. ‘గత వారం కరోనా బారినపడ్డాను. కరోనా టీకా తీసుకున్నందున స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. వైద్యులు పారాసిట్మాల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చారు. మొదట్లో ప్రజల మాటలు విని భయం వేసింది. కరోనా సోకితే శక్తి కోల్పోతానని, జుట్టు ఊడిపోతుందని చెప్పారు. కానీ, అలాంటివి ఏం జరగలేదు. ఇలాంటి సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో ధృఢంగా ఉండాలి. కరోనా తిరిగి విజృభిస్తుంది అని నేను కచ్చితంగా చెప్పలేను.. కానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. చెన్నైలోని కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్నాను.. అందుకే కరోనా టెస్ట్ చేయించుకున్నాను.’ అంటూ ఉపాసన తన పోస్ట్ లో వివరాలు చెప్పుకొచ్చారు.
