టీవీ షోలు సినిమాలకేం తగ్గట్లేదు. డ్రామాకు డ్రామా, కామెడీకి కామెడీ, రొమాన్స్ కు రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. ఇక షోలనగానే ఈటీవీనే గుర్తొస్తుంది. ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొన్నటికి మొన్న న్యూయర్ కు ఇలానే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రోమో విడుదల చేయగా, అందులో విష్ణుప్రియ అదరగొట్టేసిందనే చెప్పాలి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరాపోవే’ షోతో యాంకర్ గా మారింది. ఆ తర్వాత ఎన్నో షోలు చేసిన ఈమె.. ఆ మధ్య వచ్చిన ‘పండుగాడ్’ అనే సినిమాలోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే అదేం ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో మళ్లీ షోలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీ అయిపోయింది. ఈ మధ్ ‘జరీ జరీ పంచె కట్టి’ అని బిగ్ బాస్ మానస్ తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసింది. అది సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. దీంతో విష్ణుప్రియ-మానస్ నే ఈసారి మెయిన్ గా పెట్టి సంక్రాంతి షో ప్లాన్ చేశారు.
అందులో భాగంగానే వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. విష్ణుప్రియ తరఫు బంధువులు, మానస్ తరఫు బంధువులు వస్తారు. అలా వీరిద్దరి పెళ్లి కోసం జరిగే హంగామానే ప్రోగ్రామ్ గా చూపించబోతున్నారు. అయితే విష్ణుప్రియ-మానస్.. స్టేజీపై ‘ఈ వర్షం సాక్షిగా’ అనే సాంగ్ కి ఫెర్ఫార్మ్ చేశారు. అయితే ఇందులో కెమిస్ట్రీ వీర లెవల్లో పండించారు. చూస్తుంటే అది ఫెర్ఫార్మ్ చేస్తున్నట్లు కాకుండా జీవించేశారని అనిపించింది. ఆ రెయిన్ ఎఫెక్ట్, విష్ణుప్రియ రొమాంటిక్ డ్యాన్స్ చూసిన నెటిజన్స్.. వీళ్లిద్దరూ చేసిన ఆల్బమ్ సాంగ్ మరిచిపోయామని కామెంట్స్ పెడుతున్నారు. మరి విష్ణుప్రియ రొమాంటిక్ డ్యాన్స్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.