సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారికి తగినట్లు మూవీ స్క్రిప్ట్స్ రచయితలు రాస్తుంటారు. ఇక నటీనటులు.. తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు. అదే విధంగా బుల్లితెరపై యాంకర్స్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. గతంలో యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ తో కూడా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. వీరికి కూడా హీరో, హీరోయిన్ల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెండితెర నటుల మాదిరే వీరు కూడా వారి రేంజ్ పెరిగే కొద్ది పారితోషికం పెంచుతుంటారు. అయితే తెలుగులో గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న యాంకర్స్ వారి రెమ్యూనరేషన్స్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.
బుల్లితెరపై వచ్చిన క్రేజ్ లో యాంకర్స్ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇక సుధీర్, ప్రదీప్, రష్మీ వంటి వారు అయితే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. బుల్లి తెరపై సందడి చేసే యాంకర్లు తమ కష్టానికి తగ్గినట్టుగా రెమ్యునరేషన్ కూడా పుచ్చుకుంటారు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి తెలుగు యాంకర్స్ పారితోషకాలు పెంచినట్లు టాక్ విపిస్తోంది. బుల్లితెర యాంకర్స్ లో మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సుమ కనకాల. బుల్లితెరపై అత్యంత సీనియర్ యాంకర్స్ లో ఆమె ఒకరు. ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి ఆమె ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది. మొదట్లో బులితెర నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగిన సుమ ఆ తర్వాత ఈవెంట్స్, రియాలిటీ షో లతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈమె ఒక్కో ఈవెంట్ కు రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటోందంట. ఇక టెలివిజన్ షోలకు దాదాపు అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
రంగమ్మత్తగా మంచి క్రేజ్ సంపాదించిన బుల్లితెర బ్యూటీ అనసూయ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించే అనసూయ ఒక్కో ఈవెంట్ కు రూ.2-3 లక్షలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందంట. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. బుల్లితెరపై పలు షోలతో బాగానే సెటిల్ అయిన రష్మీ కూడా దాదాపు అనసుయా రేంజ్ లోనే ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటుందంట. ఇక మరొలేడి యాంకర్ మంజూష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు కూడా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉంది. తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మంజుషా కూడా 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.
ఇక యాంకర్ రవి గురించి ఎంత చెప్పిన తక్కువే. అతడు తనదైన మాటలతో, కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరిస్తాడు. రవి ప్రస్తుతం లక్ష రూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. రవి మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ప్రదీప్ మాచిరాజు పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఫుల్ క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రదీప్ ఒక్కో ఈవెంట్ కు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. ఇక ఇతర యాంకర్ల విషయానికి వస్తే.. యాంకర్ వర్షిణీ 30వేల రెమ్యునరేషన్, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. వీరిద్దరు మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు.
ఇక ఇటీవలే జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా కన్నడ నటి సౌమ్యరావు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సౌమ్యరావు కు కూడా సదరు షో మేకర్స రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఒక్కో ఎపిసోడ్ కు సౌమ్యరావు రూ.60 వేలు తీసుకుంటున్నట్టు టాక్. తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.